సెన్సార్ పూర్తి చేసుకున్న రాజశేఖర్ ‘కల్కి’ మూవీ..

ప్రస్తుతం రాజశేఖర్.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ సినిమా చేసాడు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌తో ఈ సినిమా పై అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కూడా కంప్లీటైంది.

news18-telugu
Updated: June 25, 2019, 8:38 PM IST
సెన్సార్ పూర్తి చేసుకున్న రాజశేఖర్ ‘కల్కి’ మూవీ..
‘కల్కి’ మూవీలో రాజశేఖర్ (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: June 25, 2019, 8:38 PM IST
కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో అసలు ప్రేక్షకులు గుర్తు కూడా పెట్టుకోలేని స్టేజ్‌కు వెళ్లిపోయిన హీరో రాజశేఖర్. ఇంక రిటైర్ కావడమా లేదంటే విలన్ పాత్రలు చేసుకోవడమా అనుకుంటున్న తరుణంలో ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన ‘పీఎస్వీ గరుడ వేగ’ సినిమాతో మరోసారి సత్తా చూపించాడు. ఈ సినిమాతో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించాడు ఈ సీనియర్ హీరో. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా రాజశేఖర్ గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు కల్కి సినిమాతో వస్తున్నాడు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించాడు. జూన్ 28న విడుదల కానున్నఈ సినిమాకు తాజాగా సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు.

Rajasekhar's kalki movie censor completed..,kalki censor,kalki censor completed,u/a certificate issue,kalki movie twitter,rajasekhar twitter,rajasekhar movies,kalki movie trailer,kalki movie honest trailer,kalki movie teaser,kalki trailer,kalki movie,rajasekhar kalki movie,rajasekhar kalki movie teaser,kalki teaser,kalki movie official teaser,kalki,rajasekhar kalki movie official teaser,kalki telugu movie,kalki movie official trailer,rajasekhar,rajasekhar kalki,kalki official trailer,kalki official teaser,rajasekhar kalki movie official trailer,kalki rajasekhar movie,kalki movie commercial trailer,telugu cinema,సెన్సార్ పూర్తి చేసుకున్న రాజశేఖర్ కల్కి మూవీ,కల్కి సెన్సార్ కంప్లీటెడ్, రాజశేఖర్,రాజశేఖర్ కల్కి ట్రైలర్,కల్కి హానెస్ట్ ట్రైలర్,తెలుగు సినిమా,
‘కల్కి’ లో రాజశేఖర్


ఈ సినిమాలో రాజశేఖర్ మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాడు రాజ‌శేఖ‌ర్. ట్రైల‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాకుండా అద్భుత‌మైన విజువ‌ల్ ట్రీట్ క‌నిపిస్తుంది. 1983లో తెలంగాణ‌లో జ‌రిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. అక్క‌డ జ‌రిగిన కొన్ని హ‌త్య‌ల మిస్ట‌రీల‌ను చేధించ‌డానికి వ‌చ్చే పోలీస్ ఆఫీస‌ర్ క‌థ ఇది. అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘కల్కి’ సినిమాతో క‌చ్చితంగా హిట్ కొడ‌తాన‌ని ధీమాగా చెబుతున్నాడు రాజశేఖర్.

First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...