Rajashekar : నేషనల్ అవార్డ్ దర్శకునితో రాజశేఖర్.. వైవిధ్యమైన కథతో కొత్త సినిమా..

Rajashekar : గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్.. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

news18-telugu
Updated: August 11, 2020, 9:05 PM IST
Rajashekar : నేషనల్ అవార్డ్ దర్శకునితో రాజశేఖర్.. వైవిధ్యమైన కథతో కొత్త సినిమా..
రాజశేఖర్ ఫైల్ ఫోటో
  • Share this:
గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో రాజశేఖర్.. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో కల్కి సినిమా చేసాడు. ఇది ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోయినా... ఫరవాలేదు అనిపించింది. దీంతో తన తదుపరి సినిమా కోసం కాస్తా ఎక్కువ సమయమే తీసుకున్నాడు రాజశేఖర్..  కల్కి తర్వాత రాజశేఖర్ సినిమా ఇప్పటివరకు ఎనౌన్స్ చేయలేదు. అయితే అహనా పెళ్లంట, పూలరంగడు, భాయ్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడంటూ కొన్ని వార్తలు వచ్చిన అవి మెటీరియలైజ్ కాలేదు. ఇక తాజా వార్త ఏమంటే.. నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠ చెప్పిన ఓ కథకు రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ కథ రాజశేఖర్‌కి చాలా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

దీంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది చిత్రబృదం. ఇక ఈ సినిమాని హీరో రాజశేఖర్ స్వయంగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా దర్శకుడు నిలకంఠ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.. ఆయన తెరకెక్కించిన 'షో', 'మిస్సమ్మ', 'విరోధి' వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. కాగా ప్రస్తుతం ఆయన రాజశేఖర్‌తో చేస్తున్న ఈ సినిమా కూడా వైవిథ్యంగా ఉండనుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్టు పని జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగితా నటీనటులు, టెక్నికల్ వివరాలు.. త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.
Published by: Suresh Rachamalla
First published: August 11, 2020, 9:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading