వైఎస్ జగన్‌కు ఝలక్ ఇచ్చిన జీవితా రాజశేఖర్ దంపతులు..

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రస్తుతం జగన్ పార్టీలోనే ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయనకు సపోర్ట్ చేసారు. గెలిచిన తర్వాత వాళ్ల పంట పండింది కూడా. ఇక జగన్‌తోనే తమ ప్రయాణం అని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 8:53 PM IST
వైఎస్ జగన్‌కు ఝలక్ ఇచ్చిన జీవితా రాజశేఖర్ దంపతులు..
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జీవిత, రాజశేఖర్
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రస్తుతం జగన్ పార్టీలోనే ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయనకు సపోర్ట్ చేసారు. గెలిచిన తర్వాత వాళ్ల పంట పండింది కూడా. ఇక జగన్‌తోనే తమ ప్రయాణం అని జీవిత రాజశేఖర్ కూడా చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నారు. పార్టీలు మారి మారి చివరికి జగన్ దగ్గరికి వచ్చి ఆగారు వీళ్లు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి జగన్‌కు హ్యాండిచ్చేలా కనిపిస్తున్నారు ఈ జంట. అవును.. నమ్మడానికి చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు పార్టీ మారారేమో అనే అనుమానం వచ్చేసింది. దానికి కారణం బాలయ్య రూలర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక. ఇందులో బాలయ్య రుణం తీర్చేసుకున్నాడు రాజశేఖర్.

Rajasekhar interesting comments on Balakrishna in Ruler movie pre release event and praised Chandrababu Naidu also pk తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రస్తుతం జగన్ పార్టీలోనే ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయనకు సపోర్ట్ చేసారు. గెలిచిన తర్వాత వాళ్ల పంట పండింది కూడా. ఇక జగన్‌తోనే తమ ప్రయాణం అని.. rajasekhar,balakrishna,ruler pre release event,rajasekhar balakrishna,rajasekhar jeevitha,jeevitha rajasekhar ys jagan,telugu cinema,వైఎస్ జగన్,రాజశేఖర్,జీవితా రాజశేఖర్,రాజశేఖర్ బాలకృష్ణ,రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
జగన్ జీవిత రాజశేఖర్

ఈ మధ్యే యాక్సిడెంట్ అయి మళ్లీ కోలుకున్న ఈ హీరో.. తాజాగా బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు. రూలర్ సినిమా వేడుక వైజాగ్‌లో అట్టహాసంగా జరిగింది. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది వచ్చారు. బాలయ్యకు అత్యంత సన్నిహితులైన తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇందులో కనిపించారు. ఇక రాజశేఖర్ కూడా తనవంతుగా వచ్చి బాలయ్య సినిమాకు ప్రమోషన్ చేసాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలయ్య రూలర్.. ఆయన తండ్రి కూడా ఓ రూలర్ అని చెప్పాడు రాజశేఖర్. అక్కడితో ఆగకుండా ఆయన వియ్యంకుడు కూడా ఓ రూలర్ అంటూ చంద్రబాబును కూడా పొగిడేసాడు ఈ సీనియర్ హీరో. ఈ సినిమా సంక్రాంతి వరకు రూల్ చేస్తూనే ఉంటుందని ఫ్యూచర్ చెప్పాడు రాజశేఖర్.

Rajasekhar interesting comments on Balakrishna in Ruler movie pre release event and praised Chandrababu Naidu also pk తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రస్తుతం జగన్ పార్టీలోనే ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయనకు సపోర్ట్ చేసారు. గెలిచిన తర్వాత వాళ్ల పంట పండింది కూడా. ఇక జగన్‌తోనే తమ ప్రయాణం అని.. rajasekhar,balakrishna,ruler pre release event,rajasekhar balakrishna,rajasekhar jeevitha,jeevitha rajasekhar ys jagan,telugu cinema,వైఎస్ జగన్,రాజశేఖర్,జీవితా రాజశేఖర్,రాజశేఖర్ బాలకృష్ణ,రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
జగన్ బాలయ్య

అక్కడ స్టేజీపై రాజశేఖర్ చెప్పిన మాటలు బాలయ్య అభిమానులను ఉర్రూతలూగించినా కూడా వైసీపీ వాళ్లకు మాత్రం షాక్ ఇచ్చాయి. ఓ పార్టీలో ఉండి మరో పార్టీని పొగడటం ఏంటో.. ఆ పార్టీ నాయకుడికి భజన చేయడమేంటో అంటూ వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. తోటి హీరో కాబట్టి బాలయ్య సినిమా వేడుకకు వెళ్లడంలో తప్పు లేదని.. కానీ అక్కడ బాలయ్యతో పాటు అందరికీ భజన చేయాల్సిన అవసరం ఏంటా అని రాజశేఖర్ దంపతులపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. గతంలో రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా ట్రైలర్ లాంఛ్ చేసాడు బాలయ్య. ఇప్పుడు ఈయన వేడుకకు వచ్చి లెక్క సరిచేసాడు రాజశేఖర్.
First published: December 14, 2019, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading