రాజశేఖర్ కూతుళ్లు సినీ కార్మికులకు ఆర్థిక సాయం..

Shivani Shivathmika: మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఇప్పటికే ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి చాలా మంది విరాళాలు అందిస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్లు ఇస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 4, 2020, 7:29 PM IST
రాజశేఖర్ కూతుళ్లు సినీ కార్మికులకు ఆర్థిక సాయం..
శివానీ శివాత్మిక రాజశేఖర్ (shivani shivathmika)
  • Share this:
లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీలో పనులన్నీ ఆగిపోయాయి. దాంతో రోజు వారి కూలీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాంతో పాటే సినీ కార్మికులకు కూడా పొట్టకూటి కోసం తిప్పలు తప్పడం లేదు. దాంతో వాళ్లకు మేమున్నాం అంటూ ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు సినిమా నటులు. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఇప్పటికే ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి చాలా మంది విరాళాలు అందిస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్లు ఇస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక రాజశేఖర్ కూడా తమ వంతుగా చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.


ఇలాంటి సమయంలో ఆదుకోడానికి తమ వంతుగా ఈ సాయం చేస్తున్నట్లు వాళ్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో పనిలేక అల్లాడిపోతున్న సినిమా కార్మికులకు ముందుగా మేమున్నాం అని భరోసా ఇచ్చింది రాజశేఖర్ దంపతులే. ఈయన పేరు మీద ఉన్న ట్రస్టు నుంచి పేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందించాడు ఈ సీనియర్ హీరో. ఆ తర్వాత శివాజీ రాజా కూడా కూరగాయలు ఇచ్చాడు. అక్కడ్నుంచి అంతా కదిలొచ్చారు.
Published by: Praveen Kumar Vadla
First published: April 4, 2020, 7:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading