హోమ్ /వార్తలు /సినిమా /

Sekhar Pre Release Event: శివాని వ్యాఖ్యలకు.. శివాత్మిక కన్నీళ్లు

Sekhar Pre Release Event: శివాని వ్యాఖ్యలకు.. శివాత్మిక కన్నీళ్లు

శివాని, శివాత్మిక

శివాని, శివాత్మిక

తన జాతకం బాగుండదని.. తన దురదృష్టవంతురాలినని చాలామంది చెప్పారని.. పూజలు కూడా చేయించుకోవాలని సూచించారన్నారు. ఆ సమయంలో నాన్నకు అలా అల అవ్వడంతో నిజమేనేమో అని భయం వేసిందన్నారు శివాని.

యంగ్రీ యంగ్ మ్యాన్  రాజశేఖర్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితా రాజశేఖర్, ఇద్దరు కూతుళ్లు, శివాని, శివాత్మిక ఎంతో అనుబంధంగా కనిపిస్తారు. అయితే తాజాగా జరిగిన శేఖర్ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో శివాని .. తండ్రి రాజశేఖర్‌తో జరిగిన ఓ ఘటన గురించి  చెబుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. శేఖర్ సినిమాకు ముందు.. రాజశేఖర్‌కు కోవిడ్ బారిన పడ్డారని..ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందన్నారు. అయితే తనకు కోవిడ్ వచ్చాక.. తన వల్లే తండ్రికి కోవిడ్ వ్యాప్తి చెందిందని శివాని చెబుతూ.. ఎమోషనల్ అయ్యారు.

చాలామంది తన జాతకం బాగుండదని.. ఏవైనా పూజలు,దోష నివరాణ చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. ఈ క్రమంలో తన వల్లే తనతండ్రికి కరోనా సోకి.. పరిస్థితి విషమంగా మారడంతో.. తాను కూడా చాలా ఆందోళన పరిస్థితుల్లో పడిపోయానన్నారు. డాక్టర్లు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నారు. ఆ సమయంలో నా జీవితం స్థంభించిపోయినట్లు అనిపించిందన్నారు. దీంతో తన తండ్రి వద్దకు వెళ్లి.. నాన్న నువ్వు... కోవిడ్ నుంచి బయటకు రావాలి.. నువ్వు రాగలవు.. నా వల్ల నీకు ఇలా జరిగింది అంటూ..శివాని తన తండ్రికి చెప్పుకున్నానన్నారు.

రాజశేఖర్, శివాని

అలాంటి సీరియస్ కండిషన్స్ నుంచి కోలుకొని.. రెండునెలల పాటు.. కష్టపడి.. తన తండ్రి కోలుకొని శేఖర్ సినిమాలో నటించారన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో స్మోకింగ్ సీన్ చేయాల్సి వచ్చిందన్నారు. దానికి వద్దు అని చెప్పినా వినకుండా.. ఆ సీన్ కూడా చేశారన్నారు. ఇక జీవిత గురించి కూడా శివాని కీలక వ్యాఖ్యలు చేశారన్నారు. మా ఫ్యామిలీ మొత్తాన్ని మా అమ్మ కంట్రోల్ చేస్తుందని బయట ఏవేవో మాట్లాడతారన్నారు. ఎవరెన్నీ మాట్లాడిన మా అమ్మంటే ఏంటో మాకు తెలుసునన్నారు. శేఖర్ సినిమాను జీవితగారు అద్భుతంగా డైరెక్ట్ చేశారన్నారు. తనకు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు శివాని.

శివానీ..తన తల్లిదండ్రుల గురించి చెప్పి ఈ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యారు. ఇక శివాని ఎమోషనల్ స్పీచ్‌కు శివాత్మిక కూడా కంటతడి పెట్టుకుంది. రాజశేఖర్ గురించి చెబుతుంటే.. ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక శేఖర్ సినిమా ఈనెల 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచడం లేదన్నారు జీవిత.

First published:

Tags: Jeevitha, Rajasekhar, Shivani rajasekhar, Shivatmika Rajasekhar

ఉత్తమ కథలు