నాకు ఎటువంటి గాయాలు కాలేదు.. క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్..

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: November 13, 2019, 10:11 AM IST
నాకు ఎటువంటి గాయాలు కాలేదు.. క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్..
హీరో రాజశేఖర్ కారు బోల్తా
  • Share this:
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారు మూడు పల్టీలు కొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. తాజాగా ఈ ఘటనపై రాజశేఖర్ మాట్లాడుతూ.. కారు నడుపుతున్న సమయంలో తనతో పాటు ఎవరు లేరని చెప్పారు. అంతేకాదు కారు ప్రమాదం జరగిని తర్వాత.. పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరకున్నారు. ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డట్టు చెప్పారు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద తన కారు ప్రమాదానికి గురైందన్నారు. అపుడు కారులో నేనొక్కడినే ఉన్నాను. ఈ ప్రమాదంలో కారు 180 కిలోమీటర్ల స్పీడులో ఉన్నట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదన్నారు. రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారులో పెద్ద మొత్తంలో మద్యంల సీసాలు లభ్యమయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది.
First published: November 13, 2019, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading