శంకర్, రాజమౌళిలో ఎవరు బెస్ట్ అంటే ఖచ్చితంగా శంకర్ అనే చెప్పాలి. ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని చిత్రాలు..భారతీయ చిత్ర పరిశ్రమలో అప్పటి వరకు తెరకెక్కని సబ్జెక్టులే కావడం విశేషం. అదే రాజమౌళి విషయానికొస్తే..సాదా సీదా కథలనే తన దర్వకత్వంతో సూపర్ హిట్ రేంజ్‌కు తీసుకువెళ్లడంలో దిట్ట. ప్రెజెంట్ జనరేషన్లో బాక్సాఫీస్ విషయానికొస్తే..రాజమౌళి తన ‘బాహుబలి’తో శంకర్‌ను ఎపుడో దాటేసాడు. ఇక ‘బాహుబలి’ సెట్స్ చేసిన రికార్డులను ‘2.O’ మూవీతో శంకర్ అధిగమించాలని చూసాడు కానీ..అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరో రికార్డును క్రియేట్ చేసాడు జక్కన్న.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న RRR సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కోతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది.
రీసెంట్గా RRR సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో తారక్..బందిపోటు పాత్రను పోసిస్తున్నట్టు..రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంలో స్వాతంత్య్రం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కథపై రకరకాల ఊహాగానాలు మొదలైనాయి.
తాజాగా ఈ సినిమా అన్ని భాషలకు కలిపి డిజిటల్ , శాటిలైట్ హక్కులు మొత్తం కలిపి రూ.150 కోట్లకు అమ్ముడుపోయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది చిత్రాల విషయానికొస్తే ఇది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పాలి. గతంలో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్,అక్షయ్ కుమార్ ‘2.O’ సినిమా డిజిటల్..శాటిలైట్ కలిపి రూ.108 కోట్లుకు అమ్ముడుపోయింది. ఇపుడా రికార్డులను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘RRR’ సినిమా రూ. 150 కోట్లతో క్రాస్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్లో సగం ప్రీ రిలీజ్ రూపంలో నిర్మాతకు తిరిగొచ్చేసింది.
దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరగుతుంది. ఈ లెక్కన ‘2.O’ సినిమాతో శంకర్ సెట్ చేసిన లెక్కను RRR సినిమాతో రాజమౌళి సరిచేసే పనిలో పడ్డాడు.
బాలీవుడ్ హాట్ కపుల్
ఇవి కూడా చదవండి
మరో సౌత్ రీమేక్‌లో అక్షయ్ కుమార్..ఏ హీరో సినిమానో తెలుసా..
‘మహానాయకుడు’ వర్సెస్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’..
మహేష్..‘మహర్షి’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Rajamouli, Ram Charan, Shankar, Telugu Cinema, Tolllywood