#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫసక్: ప్రజలకు రాజమౌళి సందేశం

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ మూవీని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైనట్టు రాజమౌళి ట్విట్టర్ వేదికగా  ప్రకటించాడు.

news18-telugu
Updated: December 6, 2018, 7:19 PM IST
#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫసక్: ప్రజలకు రాజమౌళి సందేశం
ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం
news18-telugu
Updated: December 6, 2018, 7:19 PM IST
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ మూవీని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా తారక్, చెర్రీలపై పిక్చరైజ్ చేసిన పోరాట దృష్యాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీకి ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ అనుకుంటున్నారు.

ఈ మూవీలో ఎన్టీఆర్..రావణుడి తరహా నెగిటివ్ పాత్రను పోషించనున్నట్టు సమాచారం. మరోవైపు రామ్ చరణ్..రాముడి తరహా సాఫ్ట్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి రాజమౌళి 4D టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైనట్టు రాజమౌళి ట్విట్టర్ వేదికగా  ప్రకటించాడు.



ఒకవైపు RRR మూవీకి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఈ శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు..తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ విషయాలతో పాటు..ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే సందేశమిచ్చారు. మొత్తానికి జక్కన్న ...తన RRR ప్రమోషన్స్ కోసం తెలంగాణ ఎన్నికలను బాగానే ఉపయోగించుకుంటున్నరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు