ఎన్టీఆర్, రామ్‌చరణ్ సహా అందరికీ రాజమౌళి వార్నింగ్

RRR మూవీ ప్రెస్ మీట్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని స్టిల్ లీక్ కావడంపై సీరియస్‌గా ఉన్న రాజమౌళి... ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

  • Share this:
    ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ స్టిల్ లీక్ కావడం... అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. తన సినిమాకు సంబంధించిన ఏ ఒక్క ఫోటో బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే దర్శకధీరుడు రాజమౌళి... ఎన్టీఆర్ స్టిల్ లీక్ కావడంపై ఫుల్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఎన్టీఆర్ స్టిల్ ఎలా లీకైంది ? అప్పుడు సెట్‌లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆయన సీరియస్‌గానే ఆరా తీస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు సెట్‌లో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిసైడయినట్టు తెలుస్తోంది.

    ఇకపై షూటింగ్‌లో మొబైల్స్ తో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు అన్ని బ్యాన్ చేశాడట జక్కన్న. ఇకపై రూల్స్ ఇంకా కఠినతరం చేయనున్నాడు ఈ దర్శకుడు. తన అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వచ్చేది లేదని అల్టిమేటం జారీ చేశాడని తెలుస్తోంది. ఈ విషయంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సహా ఎవరికీ మినహాయింపు ఇవ్వకూడదని రాజమౌళి డిసైడయినట్టు సమాచారం. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఫిక్సయిపోయాడు రాజమౌళి. మరి... ఎన్టీఆర్ స్టిల్ లీక్ ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: