RAJAMOULI UNABLE TO GIVE DONATE PLASMA HERE ARE THE DETAILS SR
Rajamouli : ప్లాస్మా దానం చేయలేకపోయాను.. కారణం అదే అంటోన్న రాజమౌళి..
రాజమౌళి Photo : Twitter
Rajamouli : అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కోలుకున్న తర్వాత ప్లాస్మా ఇస్తానని ఆయన గతంలోనే ప్రకటించాడు.
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కోలుకున్న తర్వాత ప్లాస్మా ఇస్తానని ఆయన గతంలోనే ప్రకటించాడు. అందులో భాగంగా ఆయన ప్లాస్మా ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అయితే ఆయన ప్లాస్మా ఇవ్వలేకపోయాడు. ఇందుకు కారణాలను తెలుపుతూ ఆయన ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ సారాంశం.. 'శరీరంలోని ప్రతిరక్షకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, నా ఇమ్యునోగ్లోబులిన్ స్థాయి 8.62 మాత్రమే ఉంది. మూములుగా ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే అధికంగా ఉండాలి. దీంతో నీను ఇవ్వలేక పోయాను.. కానీ పెద్దన్న, భైరవ మాత్రం ప్లాస్లా దానం చేశారు అంటూ రాజమౌళి పేర్కొన్నాడు. దీనికి సంబందించిన పిక్స్‌ను ఆయన పోస్ట్ చేశాడు.
Tested for antibodies.. My igG levels are 8.62. They should be above 15 to be able to donate... Peddanna and Bhairava donated today... pic.twitter.com/5zVmj0dvt0
Just done with voluntary donation of plasma at KIMS along with my son Bhairava.
Feeling good. It felt very normal like in a routine blood donation session. No need to fear at all for participating. pic.twitter.com/2WVGNUtCIR
ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణీ ట్వీట్ రూపంలో తెలుపుతూ.. కిమ్స్ ఆసుపత్రిలో డొనేట్ చేశామని, ఇదంతా సాధారణ రక్త దానం లానే ఉంటుందని ఎవరు భయపడనక్కర్లేదని పేర్కోన్నాడు. అంతేకాదు ఆయన కుమారుడు యువ సంగీత దర్శకుడు, సింగర్ కాల భైరవ కూడా ప్లాస్మా డొనేట్ చేసినట్టుగా తెలిపాడు.