తలకిందులైన రాజమౌళి ప్లాన్.. సినిమాలు వదిలి వ్యవసాయం..

Rajamouli : అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 15, 2020, 2:53 PM IST
తలకిందులైన రాజమౌళి ప్లాన్.. సినిమాలు వదిలి వ్యవసాయం..
రాజమౌళి Photo : Twitter
  • Share this:
అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఒలివియా మోరీస్ నటిస్తుంటే.. రామ్ చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. దాదాపు సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా గత రెండు నెలల నుండి వాయిదా పడుతూ వస్తోంది. తదుపరి షెడ్యూల్ పూనెలో జరగాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ షూటింగ్ జరిపే అవకాశం లేదు. దీనికి తోడు లాక్ డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చి షూటింగ్‌కు అనుమతి ఇచ్చిన హీరోలు ముందుకు రావడం లేదు. దీంతో రాజమౌళి తన మకాంను హైదరాబాద్ సిటీ నుంచి తన ఫామ్ హౌస్‌కు మార్చాడు. రాజమౌళి నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలోని ఎదులూరు గ్రామంలో విశాలమైన ఫాంహౌస్‌ను కట్టుకున్నాడు. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం జరిగే అవకాశం లేనందున తన మకాంను అక్కడకు మార్చాడట. ఇక అక్కడే కొన్ని రోజులు ఉండి వ్యవసాయ పనులు చేసుకుంటాడట.

దీనికి తోడు హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంతో ప్రస్తుతానికి ఇదే గొప్ప నిర్ణయమని భావించిన రాజమౌళి అక్కడికి షిఫ్ట్ అయ్యాడట. ఇక అక్కడే తన తదుపరి సినిమాకు సంబందిచిన స్క్రిప్ట్ పనులు చూసుకోనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్‌తో ఓ సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే.
Published by: Suresh Rachamalla
First published: July 15, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading