మహేష్, ప్రభాస్‌లతో రాజమౌళి మల్టీస్టారర్..

Rajamouli : అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 15, 2020, 10:04 AM IST
మహేష్, ప్రభాస్‌లతో రాజమౌళి మల్టీస్టారర్..
Twitter
  • Share this:
Rajamouli : అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. రాజమౌళి ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. ప్రస్తుతం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన ఈమధ్యే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబందించిన ఓ పిక్‌ను చిత్రబృందం ఇటీవలే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. మరో ముఖ్య పాత్రలో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని నటిస్తున్నాడు. అది అలా ఉంటే ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న రాజమౌళి, తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేశాడని, 'బాహుబలి'ని మించేలా ఉండే ఈ భారీ పీరియాడికల్ చిత్రంలో మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, వీరి ముగ్గురి పేర్లూ వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని, ఇదే చిత్రంలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాతగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరీ ఈ వార్తల్లో నిజం ఎంతో..


కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ 2020జులై 30 నుండి 2021 జనవరి 8కి వాయిదావేసింది చిత్రబృందం. అయితే తెలుగు టాప్ స్టార్స్‌తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్లుగానే ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో మార్కెట్ జరిగింది. ఈ సినిమా విడుదలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. అయినా అప్పుడే ఈ చిత్రం రికార్డుల ప్రభంజనం మొదలైపోయింది. ఆర్ ఆర్ ఆర్‌కు ఉన్న అదిరిపోయే బజ్ కారణంగా అధిక ధరలు చెల్లించి థీయేట్రికల్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ కృష్ణ డిస్ట్రిక్ట్ థియరిటికల్ రైట్స్ ఏకంగా 16 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇది ఆల్ టైం టాప్ ప్రైస్ కావడం గమనార్హం. ఇక నైజాంలో కూడా ఆర్ ఆర్ ఆర్ థియరిటికల్ రైట్స్ 75కోట్లు పలికాయి. అలాగే నెల్లూరు 10 కోట్లకు, కర్ణాటక రైట్స్ 50కోట్లకు అమ్మడు పోయినట్లు తెలుస్తోంది.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు