చిరంజీవి, పవన్ కల్యాణ్ ఉంటే... మాట్లాడటం కష్టమన్న రాజమౌళి

మా హీరో రామ్ చరణ్ తన తండ్రికి ‘సైరా’ సినిమాను గిఫ్ట్‌గా అందిస్తున్నాడన్నారు రాజమౌళి

news18-telugu
Updated: September 23, 2019, 10:15 AM IST
చిరంజీవి, పవన్ కల్యాణ్ ఉంటే... మాట్లాడటం కష్టమన్న రాజమౌళి
సైరా ప్రిరిలీజ్ ఈవెంట్
  • Share this:
సైరా ప్రిరీలీజ్ వేడుకకు వచ్చిన డైరెక్టర్ రాజమౌళి రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. మా హీరో రామ్ చరణ్ తన తండ్రికి ‘సైరా’ సినిమాను గిఫ్ట్‌గా అందిస్తున్నాడన్నారు. తన తండ్రికి కాదు... తెలుగు ప్రజలందరికీ కూడా రామ్ చరణ్ అందిస్తున్న ఓ బహుమతి ఈ సినిమా అంటూ కొనియాడారు జక్కన్న. చింరజీవితో ఒక్క సినిమా కూడాచేయలేకపోయానన్న రాజమౌళి.. మగధీర సినిమా కోసం ఆయనతో ఒక సీన్ మాత్రమే డైరెక్ట్ చేయగలిగానన్నారు. మగధీర సమయంలో షూటింగ్‌లో చిరంజీవి చాలా యాక్టివ్‌గా పాల్గొనేవారన్నారు. సినిమాకు ఆయన చాలా సలహాలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగైదు రోజులు తర్వాత తనకు చిరంజీవి విషయంలో ఓ డౌట్ వచ్చిందన్నారు రాజమౌళి. సినిమా హీరోగా ఆయన రామ్ చరణ్ కాకుండా తననే హీరోగా ఊహించుకుంటున్నారన్నారు. ఈ విషయం తన భార్యకు కూడా చెప్పానన్నారు. అయితే మగధీర రిలీజ్ తర్వాత నేను ఇలాంటి సినిమా ఒక్కటి కూడా తీయలేకపోయానని చిరంజీవి ఫీల్ అయ్యారన్నారు. అయితే చిరంజీవి ఆ కోరికను రామ్ చరణ్ సైరాతో పూర్తి చేస్తున్నాడన్నారు ఈ దర్శక ధీరుడు.

బ్రిటీష్‌వారిపై మొట్టమొదటగా పోరాడిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అన్నారు. ఇంత గొప్ప కథను అందించిన పరుచూరి బ్రదర్స్‌కు ముందుగా కృతజ్ఞతలు తెలపాలన్నారు రాజమౌళి. ఈ కథ కోసం వారు చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆ కోరికను మా హీరో రామ్ చరణ్ తీరస్తున్నాడన్నారు రాజమౌళి. బాహుబలి సినిమాలో 2300 విజువల్ ఎఫెక్ట్స్ కంటే సైరా సినిమాలో వీఎఫ్ఎక్స్ 3800 ఉన్నాయన్నారు. వందలాది వేలాది షాట్స్ మధ్య ఎమోషన్స్ మరిచిపోకుండా తీయడం కష్టమన్నారు. ఆ బాధ్యత అంతా డైరెక్టర్ భుజస్కంధాలపైనే ఉంటుందన్నారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ చిరంజీవి, పవన్ కల్యాణ్ వెనుక ఉంటే మాట్లాడటం కష్టమంటూ చలోక్తులు కూడా విసిరారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>