HOME »NEWS »MOVIE »rajamouli son karthikeya walks out from akashavaani movie and here the reason pk

రాజమౌళి కొడుకు కార్తికేయ షాక్.. ఆకాశవాణి నుంచి ఔట్..

రాజమౌళి కొడుకు కార్తికేయ షాక్.. ఆకాశవాణి నుంచి ఔట్..
రాజమౌళి కార్తికేయ (rajamouli karthikeya)

Karthikeya: రాజమౌళి కొడుకుగానే కాకుండా బాహుబలి లాంటి భారీ సినిమాకు తెరవెనక చాలా కష్టపడిన వాడిగా అందరికీ పరిచయం అయ్యాడు కార్తికేయ. ఆ తర్వాత కూడా తండ్రి పేరు కాకుండా..

  • Share this:
రాజమౌళి కొడుకుగానే కాకుండా బాహుబలి లాంటి భారీ సినిమాకు తెరవెనక చాలా కష్టపడిన వాడిగా అందరికీ పరిచయం అయ్యాడు కార్తికేయ. ఆ తర్వాత కూడా తండ్రి పేరు కాకుండా సొంత గుర్తింపు కోసం చూస్తున్నాడు కార్తికేయ. ఈ క్రమంలోనే నిర్మాతగా మారాడు. కొత్త కాన్సెప్టుతో సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. అలా వస్తున్న సినిమానే ఆకాశవాణి. కొత్త దర్శకుడు అశ్విన్‌తో కార్తికేయ ఈ ప్రయాణం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు మధ్యలోనే ఇది వదిలేసాడు ఈయన. దానికి కారణం కూడా మరో సినిమాతో బిజీగా ఉండటమే అని చెబుతున్నాడు.

కొన్ని రోజులుగా ఆకాశవాణి సినిమా నుంచి కార్తికేయ తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే నిజమేని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు కార్తికేయ. మరో సినిమాకి తాను లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న తరుణంలో రెండు సినిమాలను సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని చెప్పాడు కార్తికేయ. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసాడు.



ఆకాశవాణి మొదలైనప్పటి నుండి తనకి అండగా నిలిచిన దర్శకుడు.. టీం మెంబర్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపాడు కార్తికేయ. ఆకాశవాణి చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడు. ఏ. పద్మనాభ రెడ్డి నిర్మాత. కార్తికేయ తప్పుకున్నా కూడా తనతో ఉన్న స్నేహం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందని చిత్ర యూనిట్ తరఫు నుంచి దర్శకుడు అశ్విన్ గంగరాజు కూడా ఓ లేఖను విడుదల చేసాడు.
Published by:Praveen Kumar Vadla
First published:May 09, 2020, 15:02 IST