సుడిగాలి సుధీర్ సినిమాలో పాట పాడిన రాజమౌళి.. వీడియో వైరల్..

తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.

అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదా.. కానీ ఇదే నిజం. నిజ్జంగా సుడిగాలి సుధీర్ కోసం రాజమౌళి పాట పాడాడు. ఇప్పుడు ఆ పాట కూడా యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఈయన ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సుధీర్..

  • Share this:
అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదా.. కానీ ఇదే నిజం. నిజ్జంగా సుడిగాలి సుధీర్ కోసం రాజమౌళి పాట పాడాడు. ఇప్పుడు ఆ పాట కూడా యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఈయన ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా వస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు 3 మంకీస్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. కానీ దానికంటే ముందు సోలో హీరోగా నటిస్తున్న సాఫ్ట్‌వేర్ సుధీర్ విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇదిలా ఉంటే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ పనుల్లో కూడా వేగం పెంచేసారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగానే సాఫ్ట్‌వేర్ సుధీర్ అంటూ ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదల చేసారు. ఈ పాటను రాజమౌళి పాడాడు.

రాజమౌళి అంటే మన దర్శకధీరుడు రాజమౌళి కాదులెండీ.. ఆయన అన్నయ్య కీరవాణి సినిమాల్లోనే పాడడు.. ఇంక సుధీర్ కోసం ఏం పాడతాడు..? జబర్దస్త్ కామెడీ షోలో తాగుబోతు పాత్రలతో బాగా ఫేమస్ అయిన రాజమౌళి ఉన్నాడు కదా.. ఆయనే ఇప్పుడు సుధీర్ సినిమా కోసం పాడాడు. ఇందులో సుధీర్ జర్నీతో పాటు ఆయన సినిమా హీరో వరకు ఎలా ఎదిగాడు అనేది కామెడీగా రాసాడు లిరిసిస్ట్. సినిమాకు ఈ పాట కూడా బాగానే హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. తన సినిమా కోసం నాగబాబు, రోజా.. ఇతర జబర్దస్త్ కమెడియన్స్ అందర్నీ వాడేస్తున్నాడు సుధీర్. మరి ఈయన బుల్లితెరపై మ్యాజిక్ చేసిన సుధీర్.. వెండితెరపై ఏం చేస్తాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: