Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 1, 2020, 2:48 PM IST
ప్రభాస్,రాజమౌళి (File/Photo)
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు రాజమౌళి మాత్రం ఇదే అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ ప్రభాస్‌తో సినిమా అంటే ఈయన సిద్ధంగా లేడు. ఇప్పటికే ఈయన కోసం ఐదేళ్లకు పైగానే వెచ్చించాడు రాజమౌళి. దానికి ప్రతిఫలంగానే బాహుబలి లాంటి ఇంటర్నేషనల్ సినిమా వచ్చింది. మరోసారి అప్పుడే ప్రభాస్ సినిమా అంటే ఒప్పుకోవడం లేదు దర్శక ధీరుడు. అమ్మో ఇప్పుడు మళ్లీ ఆయనతో సినిమా అంటే ఇంకేం లేదు.. నన్ను వదిలేయండ్రా నాయనా అంటున్నాడు. అయితే ఈ మాటలు సరదాగానే అంటున్నాడు రాజమౌళి. అసలు విషయం ఏంటంటే తెలుగులో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబోలో వచ్చిన ఛత్రపతి, బాహుబలి 1,2 సినిమాలు రికార్డులు తిరగరాసాయి. అందులో బాహుబలి అయితే ఏకంగా 2500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో.. ప్రభాస్ నాలుగైదు సినిమలాతో బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ రాజమౌళి (Prabhas Rajamouli)
ఈ క్రమంలోనే అభిమానులు ప్రభాస్‌తో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారంటూ రాజమౌళిని అడిగారు. దానికి ఉలిక్కి పడ్డాడు జక్కన్న. ఇప్పటికే చాలా టైమ్ ఇచ్చాను.. ఇక చాలు.. ఇప్పట్లో ప్రభాస్‌తో మళ్లీ వద్దు.. చేయలేను వదిలేయండ్రా నాయనా అనేసాడు. బాహుబలి తీసుకొచ్చిన ఇమేజ్‌తో ప్రభాస్ ప్రస్తుతం వరసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. ఈయన నెక్ట్స్ మూడు సినిమాల బడ్జెట్ 1000 కోట్లు దాటిపోయింది. దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ రేంజ్ ఇప్పుడెలా ఉందో..?

ప్రభాస్ రాజమౌళి (rajamouli prabhas)
ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా అంటే మరో నాలుగేళ్లు ఇవ్వాలి. అందుకే రాజమౌళి కూడా ఇప్పట్లో చేయలేం అంటున్నాడు. అయితే ఇదంతా సరదాకు అన్న మాటలే అయినా కథ డిమాండ్ చేస్తే కచ్చితంగా మళ్లీ చేస్తానంటున్నాడు దర్శక ధీరుడు. కచ్చితంగా ఇద్దరికి కుదిర్తే సినిమా చేస్తామంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తయ్యేసరికి మరో నాలుగేళ్లు పడుతుంది. మరోవైపు రాజమౌళి కూడా వరస కమిట్మెంట్స్ ఇచ్చాడు. అంటే ఇప్పట్లో ఈ కాంబినేషన్ ఊహించడం అయితే కష్టమే.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 1, 2020, 2:48 PM IST