RRR సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అంతగా ఆ సినిమా కోసం వేచి చూస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఆసక్తి ఉంటుంది. అయితే దర్శక నిర్మాతలే చాలా రోజుల నుంచి సినిమాకు సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా బయటికి ఇవ్వలేదు. అయితే అందరి ఆకలి తీర్చేస్తూ తాజాగా ఓ పోస్టర్‌తో పాటు పండగ లాంటి తీపికబురు కూడా చెప్పారు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ దాదాపు పూర్తైపోయింది. కేవలం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. పైగా ఇప్పటికే రెండు భాషలకు సంబంధించిన డబ్బింగ్ కూడా చరణ్, ఎన్టీఆర్ పూర్తి చేసారని కూడా తెలిపారు. తాజాగా బైక్‌పై చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూర్చుని చక్కర్లు కొడుతున్న ఫోటోను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. కొమరం భీమ్ బైక్ నడుపుతుంటే.. అల్లూరి వెనక కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడు.
ఇద్దరు స్టార్ హీరోలు అలా నవ్వులు చిందిస్తూ ఒకే మోటార్ బైక్‌పై వెళ్తుంటే చూడ్డానికి అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదంటే నమ్మండి..!
Moving at a rapid pace ??
— RRR Movie (@RRRMovie) June 29, 2021
Except for two songs, we are done with the shoot. #RRRMovie@tarak9999 & @alwaysramcharan have completed the dubbing for 2 languages and will wind up the rest soon. ?? pic.twitter.com/6g1h5yTQhK
ఇదిలా ఉంటే ఇంత చేసినా ఈ చిత్ర విడుదల తేదీని మాత్రం ఖరారు చేయలేదు దర్శక నిర్మాతలు. ముందు చెప్పినట్లు అక్టోబర్ 13న రావడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలానే బ్యాలెన్స్ ఉన్నాయి.
రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే రెండు పాటలు మాత్రమే ఉన్నాయి.. మిగిలిన షూటింగ్ అంతా అయిపోయింది అంటూ గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవ్గన్, ఒలివియా మోరీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rrr movie, Telugu Cinema, Tollywood