HOME » NEWS » movies » RAJAMOULI SAYS NO TO CHIRANJEEVI WHEN HE ASKED TO INTRODUCE RAM CHARAN PK

రామ్ చరణ్‌తో సినిమా చేయలేనన్న రాజమౌళి.. ఎందుకంటే..?

Rajamouli Ram Charan: అదేంటి.. రామ్ చరణ్‌తో కలిసి ఇప్పటికే మగధీర లాంటి సెన్సేషనల్ సినిమా చేసాడు.. ఇప్పుడు మరోసారి కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాకు పని చేస్తున్నారు.. అలాంటిది రాజమౌళి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 23, 2020, 7:38 PM IST
రామ్ చరణ్‌తో సినిమా చేయలేనన్న రాజమౌళి.. ఎందుకంటే..?
రామ్ చరణ్, రాజమౌళి (Instagram/Photo)
  • Share this:
అదేంటి.. రామ్ చరణ్‌తో కలిసి ఇప్పటికే మగధీర లాంటి సెన్సేషనల్ సినిమా చేసాడు.. ఇప్పుడు మరోసారి కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాకు పని చేస్తున్నారు.. అలాంటిది రాజమౌళి ఎప్పుడు రామ్ చరణ్ సినిమాకు నో చెప్పాడనుకుంటున్నారా..? ఇది జరిగి కూడా దాదాపు 14 ఏళ్లవుతుంది. అప్పట్లో రామ్ చరణ్ ఇండస్ట్రీకి రాకముందు ఆయన్ని పరిచయం చేయాలని దర్శకుల కోసం చిరంజీవి వెతుకుతున్న రోజులవి. అప్పటికే ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళిపై చిరంజీవి కన్ను పడింది. తన కొడుకును పరిచయం చేసే బాధ్యత మీరు తీసుకోండని ఆయన్ని అడిగాడు కూడా మెగాస్టార్.

రాజమౌళి చిరంజీవి (rajamouli chiranjeevi)
రాజమౌళి చిరంజీవి (rajamouli chiranjeevi)


చిరు ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడంటారు రాజమౌళి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సీన్‌లోకి వచ్చాడు. రామ్ చరణ్‌ ఎంట్రీకి సరిపోయే కథ సిద్ధం చేసాడు. అదే చిరుత.. ఈ సినిమా సంచలన విజయం సాధించకపోయినా కూడా రామ్ చరణ్ కెరీర్‌కు పర్ఫెక్ట్ పునాది వేసింది. అయితే రాజమౌళి కాదనడానికి కూడా కారణాలు లేకపోలేదు. రామ్ చరణ్ ఎలా ఉంటాడు.. ఎలా నటిస్తాడు.. అతడి ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి.. డాన్సులు చేస్తాడా చేయడా.. ఎమోషన్ పండిస్తాడా లేదా.. ఇలా ఏం తెలుసుకోకుండా తొలి సినిమా చేయడానికి రాజమౌళి వెనకడుగు వేసాడని ఇండస్ట్రీలో విశ్లేషకులు చెబుతున్న మాట.

రామ్ చరణ్ చిరు రాజమౌళి (Ram Charan chiranjeevi rajamouli)
రామ్ చరణ్ చిరు రాజమౌళి (Ram Charan chiranjeevi rajamouli)


ఆ సమయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక.. చిరుత చూసిన తర్వాత రెండో సినిమా తాను చేస్తానని చిరంజీవికి మాటిచ్చాడు రాజమౌళి. అన్నట్లుగానే చిరుత సినిమా తర్వాత మగధీర చేసి చరణ్ కెరీర్‌కు కావాల్సినంత గట్టి సౌధాన్ని నిర్మించాడు. చిరుత సినిమా చూసిన తర్వాత రాజమౌళికి రామ్ చరణ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేయాలనేది అర్థమైంది. అందుకే తొలి సినిమా ఆఫర్ ఇచ్చినా కూడా నో చెప్పాడు. ఒకవేళ నిజంగానే చరణ్ తొలి సినిమా రాజమౌళి చేసుంటే మగధీర లాంటి సినిమా మిస్ అయిపోయేవాళ్లు తెలుగు ప్రేక్షకులు. అయినా కూడా ఓ నటుడి బలాబలాలు తెలుసుకోకుండా అతడితో సినిమాకు రాజమౌళి అస్సలు కమిట్ అవ్వడు. రామ్ చరణ్ విషయంలో కూడా ఇదే జరిగిందంటారు కొందరు.
Published by: Praveen Kumar Vadla
First published: April 23, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading