Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: April 22, 2020, 3:44 PM IST
రాజమౌళి సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి అంటూ వర్మ రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అందరికీ ఒకటే నచ్చాలనే రూల్ ఏం లేదు. ఒకరికి నచ్చింది మరొకరికి చిరాకు పుట్టిస్తుంది. సినిమాల విషయంలో కూడా అంతే. ఇప్పుడు రాజమౌళికి కూడా ఇదే జరిగింది. ప్రపంచమంతా గొప్ప సినిమా అంటూ కితాబులిచ్చిన పారాసైట్ రాజమౌళికి అస్సలు ఎక్కలేదు. పైగా ఆ సినిమా పెట్టిన తర్వాత నిద్ర పోయాడు ఈయన. ఆస్కార్ అవార్డులతో పాటు ఇంకా చాలా అవార్డులు పొందిన సినిమా చూసి రాజమౌళి నిద్రపోయాడు. ప్రపంచంలోనే తొలిసారి ఓ సినిమాకు నాలుగు ఆస్కార్ అవార్డులు రావడం ఇదే తొలిసారి. అలాంటి సినిమా పారాసైట్.

రాజమౌళి పారాసైట్ (rajamoili parasite)
ఇప్పుడు ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పి సంచలనం సృష్టించాడు రాజమౌళి. ఈ సినిమా మొదలవ్వడమే చాలా స్లోగా అయిందని.. ఆ తర్వాత నిద్ర వచ్చేసిందని చెప్పాడు రాజమౌళి. తన భార్య మాత్రం సినిమా అంతా చూసి కథ చెప్తే తనకు ఎక్కలేదని చెప్పాడు ఈయన. ఆస్కార్ గెలిచిన పారాసైట్ తనకు నచ్చకపోవడం పెద్ద విశేషం కాదని.. తన టేస్టుకు ఆ సినిమా సరిపోలేదని చెప్పాడు ఈయన.

రాజమౌళి పారాసైట్ (rajamoili parasite)
అంత మాత్రానా అది గొప్ప సినిమా కాకుండా పోదని.. ఎవరి టేస్టులు వాళ్లకు ఉంటాయని చెప్పాడు దర్శక ధీరుడు. అందుకే పారాసైట్ తనకు నచ్చలేదని చెప్పాడు. దక్షిణ కొరియా రూపొందించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు చాలానే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రాజమౌళికి నచ్చకపోవడంతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది పారాసైట్.
Published by:
Praveen Kumar Vadla
First published:
April 22, 2020, 3:44 PM IST