ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్గణ్లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఈ యేడాది జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం.. ఒకేసారి 10కి పైగా భాషల్లో డబ్ చేసిన రిలీజ్ చేయడం.. గ్రాఫిక్స్‌తో పాటు మంచి క్వాలిటీతో సినిమాను అందిచాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రాజమౌళి వచ్చే 2021 జనవరి 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. బాహుబలి సిరీస్ రాజమౌళి సినిమాలకు దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో డిమాండ్ పెరిగింది. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలు నటించడం వంటి కారణాలతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో 1920 బ్యాక్ డ్రాప్‌తో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి మహనీయులు జీవితాలను ఆదర్శంగా తీసుకొని దానికి కొంత కాల్పనిక కథ జోడించి RRR సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే వికారాబాద్ అడవుల్లో అజయ్ దేవ్‌గణ్, శ్రియలతో పాటు ఇతర ముఖ్య తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
తాజాగా ఈ సినిమాను తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు భారీ మొత్తంలో దక్కించుకున్నాడు. మొత్తంగా నైజాంలో ఈ సినిమాను రూ.72 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. బాహుబలి సినిమాతో దర్శకుడిగా రాజమౌళి క్రేజ్ రోలుగా ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇమేజ్ వెరసి ఈ రేటు పలికింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హక్కులు రూ.100 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక హిందీ వెర్సన్, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా బిజినెస్ మాత్రం క్లోజ్ కాలేదు. మొత్తనానికి తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ బాహుబలి రికార్డును బీట్ చేసేలా ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 08, 2020, 20:20 IST