RAJAMOULI RRR TEAM WILL PLAN A BIG SURPRISE TO FANS ON OCTOBER 6TH PK
RRR Update: అభిమానులకు ‘RRR’ టీం సర్ప్రైజ్.. అక్టోబర్ 6న చూస్కోండి..
ట్రిపుల్ ఆర్ పోస్టర్ (RRR movie poster)
RRR update: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ట్రిపుల్ ఆర్ గురించి కేవలం మన ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలు కూడా వేచి చూస్తున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ట్రిపుల్ ఆర్ గురించి కేవలం మన ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలు కూడా వేచి చూస్తున్నాయి. బాహుబలితో ఆయన వేసిన పునాది అలా ఉంది మరి. అందుకే జక్కన్న సినిమా కోసం అంతా కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. అన్ని పరిస్థితులు బాగుండుంటే ఈ పాటికి ట్రిపుల్ ఆర్ మరో రెండు మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది. కానీ కోవిడ్ వచ్చి అంతా నాశనం చేసింది. గత ఆర్నెళ్లుగా అన్నీ మానేసి కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులతోనే బిజీగా ఉన్నారు ట్రిపుల్ ఆర్ టీం. మధ్యలో రాజమౌళికి కరోనా రావడం.. నిర్మాత దానయ్య కూడా కోవిడ్ బారిన పడటంతో షూటింగ్ విషయమే అంతా మరిచిపోయారు. ఇప్పుడు అప్పుడు అంటూ వస్తున్న అప్ డేట్ ఇప్పుడు వచ్చేసింది. అక్టోబర్ 6న స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తున్నామంటూ ట్రిపుల్ ఆర్ టీం ట్వీట్ చేసింది.
ట్రిపుల్ ఆర్ షూటింగ్ (RRR movie unit)
ఇన్ని రోజులు సెలవులు చాలు.. పండగ చేసుకుంది కూడా చాలు.. మాపై మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు.. ఇక అన్నీ అయిపోయాయి.. ఇప్పుడు మేం మీకు సర్ప్రైజ్ ఇస్తున్నాం అంటూ ట్వీటేసారు చిత్రయూనిట్. ఇప్పటి వరకు జరిగింది చాలు.. అక్టోబర్ 6న అదిరిపోయే అప్డేట్ వస్తుందని క్లారిటీ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీం. రాజమౌళి యూనిట్ ఇవ్వబోయే ఆ అప్డేట్ షూటింగే అని తెలుస్తుంది. అక్టోబర్ 5న ఇప్పటికే టెస్ట్ షూట్ ఒకటి నిర్వహించారు చిత్రయూనిట్.
Enough of our festival posts and your unparalleled creativity in taunting us for updates 😅😂
Thanks for bombarding us with all your love. Time flew by, and finally the moment is here! Now, it’s our turn to entertain you... 🤗
అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ టెస్ట్ షూట్ చేసారు. దాంతో అంతా సేఫ్ అని భావించి.. అక్టోబర్ 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ట్రిపుల్ ఆర్ టీం నుంచి అప్డేట్ వస్తుండటంతో అటు నందమూరి.. ఇటు మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.