ఫ్రెండ్‌షిప్ డే రోజున ఆప్తమిత్రులకు RRR టీమ్.. స్పెషల్ గిప్ట్..

RRR సినిమా పోస్టర్ (Source: Twitter)

RRR friendship day gift : పాపులర్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా  తెరకెక్కిస్తున్న చిత్రం RRR తెలిసిందే. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఫ్రెండ్ షిప్ డేరోజున RRR టీమ్ ఫ్రెండ్స్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్‌‌‌ను అందిస్తోంది.

  • Share this:
    పాపులర్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా  తెరకెక్కిస్తున్న చిత్రం RRR తెలిసిందే. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  చరణ్‌కు జోడిగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుండగా.. తారక్‌కు జంటగా  అమెరికన్ నటి ఎమ్మా రోబర్ట్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షేడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న RRR.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటూ..వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అది అలా ఉంటే ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా RRR చిత్ర బృందం ట్వీటర్ వేదికగా  ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.


    ఆ ట్వీట్‌లో  ‘ఓ మంచి స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది.. RRR సినిమాలోని రామరాజు, భీమ్‌ల స్నేహం మాదిరిగా.. ఆ విధంగా మీ జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడిని ఖచ్చితంగా కలిసి ఉంటారు. అలా కలిసిన వ్యక్తుల్లో మీకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఉంటే.. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతనితో దిగిన ఫొటోను మాతో పంచుకోండి’ అంటూ కోరింది చిత్ర బృందం. దీంతో నెటిజన్స్.. తమ జీవితాల్లో ఎదురైన లేదా వారు ఎక్స్ పీరియన్స్ చేసిన మిత్రుల ఫోటోలను షేర్ చేస్తూ.. కామెంట్స్ పెడుతున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: