RRR : ఆర్ఆర్ఆర్ కోసం డబ్బింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్..

RRR ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ పూర్తి (Twitter/Photo)

RRR  (Roudram Ranma Rudhiram) | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌ (Ram Charan), అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తైయినట్టు సమాచారం.

  • Share this:
    RRR  (Roudram Ranma Rudhiram) | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌ (Ram Charan), అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా.. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ఇటు కరోనా కేసులు తగ్గడంతో పాటు అటు ఏపీలో కూడా టికెట్ రేట్ల విషయంలో త్వరలో క్లారిటీ రానున్న నేపథ్యంలో ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు  ప్రకటించారు.

    రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ సడెన్‌గా సంక్రాంతి బరిలో దిగడంతో మిగతా నిర్మాతలు, హీరోలు జక్కన్న తీసుకున్న డెసిషన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. పైకి ఏమి మాట్లాకపోయినా.. లో లోపల రాజమౌళి తీసుకున్న నిర్ణయంపై రగిలిపోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్ వెళ్లి వచ్చింది. దానికి ఒక రోజు ముందు అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ నటిస్తోన్న ‘గంగూభాయ్ కతియావాడి’ సినిమా విడుదల అవుతోంది.

    Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఎన్టీఆర్, రామ్  చరణ్‌ పూర్తి చేశారట. ఎన్టీఆర్.. కేవలం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను ఎన్టీఆర్ చెప్పుకోవడం విశేషం. ఇటు రామ్ చరణ్.. తెలుగు, హిందీ, తమిళంలో మాత్రమే తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం. అటు అజయ్ దేవ్‌గణ్, ఆలియాతో పాటు మిగతా నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారట. డబ్బింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా ఫైనల్‌గా కట్ చేసే పనిలో రాజమౌళి పడ్డారట.

    Mohan Babu: నట ప్రపూర్ణ మోహన్‌బాబును కలెక్షన్ కింగ్ చేసింది ఎవరో తెలుసా..

    ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది.

    Priyamani: పొట్టి నిక్కరులో పిచ్చెక్కించిన ప్రియమణి.. వావ్ అనాల్సిందే..

    పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: