వచ్చే యేడాది సంక్రాంతికి అనూహ్యంగా రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో టాలీవుడ్లో పెద్ద ప్రకంపనలే పుట్టించింది. దీంతో వచ్చే సంక్రాంతికి బరిలో దిగుదామనుకున్న చాలా మంది హీరోలు.. తమ సినిమాలను కొంచెం అటూ ఇటూ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రతి సంక్రాంతికి ఒకటి మూడు సినిమాలు పోటీ పడటం కామన్. రాజమౌళి ఎఫెక్ట్‌తో వేరే ఏ సినిమాలు పోటీలో నిలబడే సాహసం చేయలెేకపోతున్నాయి. కానీ వచ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సోలోగా పోటీకి దిగుతుందని దాదాపు అందరు అనుకుంటున్నారు. ఇలాంటి ఈ తరుణంలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కు పోటీగా అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ నమ్ముకొని వచ్చే యేడాది రంగంలోకి దిగాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. పోయినేడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్ తర్వాత.. రీసెంట్గా మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి ఫలితాన్నే అందుకున్నాడు. తాజాగా ముచ్చటగా మూడోసారి ముగ్గుల పండగను నమ్ముకుని రంగంలోకి దిగబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 2021 సంక్రాంతికి అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ మూవీతో సందడి చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ముందు నుంచి ఎఫ్ 2కు సీక్వెల్ నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నాడు దిల్ రాజు. ఇక అనిల్ రావిపూడి కూడా ఎఫ్ 3 కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్టు సమాచారం. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సీక్వెల్లో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు మహేష్ బాబును మూడో హీరోగా నటింపచేయాలనే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నాడు.

రాజమౌళి,అనిల్ రావిపూడి (File/Photo)
ఇప్పటికే ఎఫ్ 3కి సంబంధించిన కథను మహేష్ బాబుకు కూడా వినిపించాడట. ఒకవేళ మహేష్ బాబు ఈ సీక్వెల్‌కు ఓకే చెబితే మాత్రం 2021 సంక్రాంతికి పోటీగా ఎఫ్ 2 సీక్వెల్‌ను రిలీజ్ చేయడానికి అనిల్ రావిపూడి సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్‌తో చాలా మంది హీరోలు సంక్రాంతి బరి నుంచి పక్కకు తప్పుకున్నారు. మరి ఇలాంటి సమయంలో భారీ మల్టీస్టారర్‌ను ఢీ కొట్టడానికి భారీ ఆలోచనలు చేస్తోన్న అనిల్ రావిపూడి.. సంక్రాంతి బరిలో ఎఫ్ 3 సినిమాను బరిలో నిలుపుతాడా లేదా అనేది చూడాలి. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ఈ సినిమాకు సంబంధించిన తెలంగాణ హక్కులను దిల్ రాజు భారీ రేటుకే దక్కించుకున్నాడు. ఇలాంటి సమయంలో తన నిర్మాణంలో తెరకెక్కనున్న ఎఫ్ 3 సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే ప్రయత్నం చేస్తాడా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 13, 2020, 09:22 IST