news18-telugu
Updated: November 11, 2020, 10:14 PM IST
ఆర్ఆర్ఆర్లో ఆలియా భట్ (Twitter/Photo)
RRR-Alia Bhatt | దర్శక బాహుబలి రాజమౌళికి మరోసారి షూటింగ్ విషయంలో ఆలియా భట్ ఝలక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో తెరకెక్కిస్తోన్న ‘రౌద్రం రణం రుధిరం’ ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి నుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఐతే.. ఈ సినిమాకు బాలీవుడ్లో క్రేజ్ తీసుకొచ్చేందకు ఆలియా భట్‌ను హీరోయిన్గా ఎంపిక చేసారు. మరోవైపు ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ టీజర్‌ను రిలీజ్ చేస్తే..రెస్పాన్స్ సంగతి పక్కనపెడితే.. అంతకు మించి వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే కొంత మంది గిరిజన నేతలు రాజమౌళికి వార్నింగులు గట్రా ఇచ్చారు. చరిత్రను వక్రీకరిస్తే.. తెరలు చినిగిపోవడం ఖాయం అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇంకో కథానాయికగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటిస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తన తర్వాత షెడ్యూల్‌ను పూణేలో నిర్ణయించింది. అయితే కారోనా కారణంగా ఆ షెడ్యూల్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమాలో చరణ్ జోడి ఆలియా భట్.. ఇంతవరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. అయితే ఈ పూణే షెడ్యూల్లో ఆలియా ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ కానుందని చిత్రబృందం చెప్పుకొచ్చింది.

ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter
ఇప్పటికే పలు కారణాలతో ఈ సినిమా షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు కరోనా లాక్ డౌన్ కూడా తోడవ్వడంతో ఆలియా ఇప్పటి వరకు టీంతో జాయిన్ కాలేదు. కాగా బాలీవుడ్ బిజీ నటీమణులలో ఆలియా భట్ ఒకరు. ఆమె చేతిలో ప్రస్తుతం అదిరిపోయే ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె RRR సినిమాతో పాటు, గంగూబాయ్, బ్రహ్మస్త్రలో నటిస్తోంది. దీంతో ప్రతి ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్‌తో డేట్స్ ఇచ్చిన ఆలియా భట్‌కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టతరంగా మారిందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె ఈ సినిమాలో నటించడం కష్టం అన్నారు. ఈ వారంలో ఈమె జాయిన్ కానున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో జాయిన్ కావడానికి ఆలియా భట్‌కు మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది.

ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter
ప్రస్తుతం ఈ భామ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయి’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరో రెండు వారాలు చేస్తే.. ఆలియా భట్ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ ముగుస్తోంది. ఇప్పటికే ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఆలియా కంప్లీట్ చేసి డబ్బింగ్ కూడా పూర్తి చేసేసింది. గంగుబాయి తర్వాత ఆలియా భట్ ఫ్రీ అయి తన డేట్స్ అన్ని ఆర్ఆర్ఆర్ కేటాయించనున్నదట. డిసెంబర్ ఎండింగ్ వరకు కంటిన్యూగా ఆర్ఆర్ఆర్ షూట్లో పాల్గొని ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నదట. ఇటీవలె సుశాంత్ మృతి కేసులో ఆలియా భట్‌ను నెటిజన్స్ ఆలియాతో పాటు ఆమె ఫ్యామిలీని ట్రోల్ చేసారు. సుశాంత్ మరణానికి ఆమె తండ్రి మహేష్ భట్ కూడా ఓ కారణమంటూ నెటిజన్స్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆలియా నెపోటిజం కారణంగానే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుందని.. విమర్శించారు.

ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)
అంతేందుకు ఆ నేపథ్యంలోనే ఆలియా భట్ నటించిన సడక్ 2 ట్రైలర్ కు య్యూట్యూబ్ లో తీవ్ర అవమానం జరిగింది. ఆ ట్రైలర్ అత్యధిక సంఖ్యలో డిస్ లైక్ చేసిన ట్రైలర్‌గా నిలిచి రికార్డ్ సృష్టించింది. మరోవైపు ఆలియాను ఆర్ఆర్ఆర్ నుంచి తొలిగించకపోతే.. బిహార్‌లో ఈ సినిమాను విడుదల కానీయబోమని సుశాంత్ అభిమానులు ఆల్రెడీ రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఇటు కొమరం భీమ్ ఇష్యూతో పాటు అటు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఆలియా భట్ ఇష్యూలను ముందు ముందు రాజమౌళి ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 11, 2020, 10:14 PM IST