రాజమౌళి ఆ విషయంలో కట్టప్పను ఫాలో అవుతాడా..లేక హ్యాండ్ ఇస్తాడా..

ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాలతో యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలుగు దర్శకుడు.

news18-telugu
Updated: December 10, 2019, 7:30 PM IST
రాజమౌళి ఆ విషయంలో కట్టప్పను ఫాలో అవుతాడా..లేక హ్యాండ్ ఇస్తాడా..
దర్శకుడు రాజమౌళి (rajamouli)
  • Share this:
ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాలతో యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలుగు దర్శకుడు. సాధారణంగా ఏదైనా సినిమా విడుదలవుతుందంటే ఆ మూవీ హిట్ అవుతుందా…లేక ఫెయిల్ అవుతుందా అని మాట్లాడుకుంటారు జనాలు. కానీ రాజమౌళి సినిమాలు ప్రత్యేకం. ఆయన సినిమా విడుదలవుతుందంటే రికార్డుల గురించి మాట్లాడుకుంటాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి సిరీస్ మూవీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి, ఎవరూ అందుకోలేనంత స్థాయికి ఎదిగాడు రాజమౌళి. తాజాగా తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ RRR పై కూడా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా అనేక భాషలో విడుదల కానుంది. అయితే ముఖ్యంగా ఈ చిత్ర హిందీ విడుదల హక్కులకు అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. రాజమౌళి ట్రాక్ రికార్డ చూసి హిందీ బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు RRR హక్కులు మాకు కావాలంటే మాకు అంటూ పోటి పడుతున్నారట. వాటిలో ప్రముఖంగా యష్ రాజ్ ఫిలిమ్స్, టీ సిరీస్, ఎరోస్ వంటి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ముందున్నాయి.
అయితే గతంలో బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన  కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఈ పోటిలో ఉంది. మరీ రాజమౌళి ఈసారి కూడా వారికే ఆర్ ఆర్ ఆర్ హిందీ హక్కులు ఇస్తారా.. లేక వేరే సంస్థను ఎంచుకుంటారా అనేది చూడాలి. ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.అదిరిన భూమి ఫడ్నేకర్ లేటెస్ట్ అందాలు..
Published by: Suresh Rachamalla
First published: December 10, 2019, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading