అభిమానితో బ్రేక్ ఫాస్ట్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే కదా. ఆ స్నేహం కారణంగా వీళ్లిద్దరు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. తాజాగా తారక్, చెర్రీలతో ఓ మహిళ అభిమాని బ్రేక్ ఫాస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: December 25, 2019, 7:11 AM IST
అభిమానితో బ్రేక్ ఫాస్ట్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్..
జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో మహిళ అభిమాని (Twitter/Photo)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే కదా. ఆ స్నేహం కారణంగా వీళ్లిద్దరు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. తారక్. కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథతో జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న  విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో లీకైయ్యాయి. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించి ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చారు. ఓ మహిళ అభిమానితో వీరిద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు అభిమాని అయిన ఈమె వీళ్లిద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆమె ఎవరు అనే విషయమై ఎవరు తెలియదు. మొత్తానికి ఇద్దరు బడా స్టార్ హీరోలతో ఓ అభిమాని ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 25, 2019, 7:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading