అత్తమ్మ సురేఖకు బర్త్ డే విషెస్ తెలియజేసిన మెగా కోడలు ఉపాసన..

ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది.ఈ రోజు చిరంజీవి భార్య రామ్ చరణ్ తల్లిగారైన సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా  ఉపాసన తన అత్తమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

news18-telugu
Updated: February 18, 2020, 2:13 PM IST
అత్తమ్మ సురేఖకు బర్త్ డే విషెస్ తెలియజేసిన మెగా కోడలు ఉపాసన..
అత్తమ్మ సురేఖ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కోడలు ఉపాసన (Instagram/Photo)
  • Share this:
ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కేవలం ఉపాసన గృహిణిగా పరిమితం కాకుండా సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. ఈ రోజు చిరంజీవి భార్య రామ్ చరణ్ తల్లిగారైన సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా  ఉపాసన తన అత్తమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అంతేకాదు మా మంచి అత్తమ్మ అంటూ సోషల్ మీడియాలో అత్తమ్మ సురేఖకు సంబంధించిన పుట్టినరోజు వేడుకలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఉపాసన విషయానికొస్తే.. రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది.
View this post on Instagram

Happy birthday Athama. ❤️❤️❤️ Love u.

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on
చిరంజీవి..విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ మాత్రం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్.. వరస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు