హోమ్ /వార్తలు /సినిమా /

Rajamouli - Pawan Kalyan - Mahesh Babu : రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందడుగు..

Rajamouli - Pawan Kalyan - Mahesh Babu : రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందడుగు..

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందడుగు (Twitter/Photo)

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందడుగు (Twitter/Photo)

Rajamouli - Pawan Kalyan - Mahesh Babu : రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందడుగు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

  Rajamouli - Pawan Kalyan - Mahesh Babu : రాజమౌళి ఆర్ఆర్ఆర్ (RRR) ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందడుగు వేస్తున్నారు. ముందడుగు అంటే తమ సినిమాలను తర్వాత నెలల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సోమవారం విడుదలైన ‘RRR’ ఫస్ట్ గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ సినిమాను జనవరి 7న సంక్రాంతికి ఒక వారం ముందు విడుదల చేస్తున్నారు. దాంతో పాటు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’,(Bheemla Nayak) జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే.. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్‌లో మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమా జనవరి 13న విడుదల కానున్నట్టు ప్రకటించారు.

  మొత్తంగా ఎన్నడు లేనట్టుగా ప్రస్తుతం తెలుగు టాప్ లీగ్ హీరోలందరూ సంక్రాంతి బరిలో సై అంటే సై అంటున్నారు.ఇక సంక్రాంతి బరిలో ఇపుడు చెప్పుకుంటున్న సినిమాల్లో మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమా, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలు విడుదల తేదిలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య.. ఆ చిత్ర నిర్మాతలతో మాట్లాడినట్టు సమాచారం.

  Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

  ఇక ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నందమూరి, మెగా హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక రామ్ చరణ్ సినిమాకు పోటీ ఎందుకులే అని పవన్ కళ్యాణ్ తన సినిమాను మార్చికి పోస్ట్ పోన్ చేయమన్నట్టు తన నిర్మాతలతో చెప్పినట్టు సమాచారం.

  బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

  ఇక మహేష్ బాబు కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రాజమౌళితో చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’తో పోటీ వద్దని రాజమౌళి.. మహేష్ బాబుకు రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. దీంతో మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలుబడాల్సి ఉంది.

  Bollywood 2021 : చివరి రెండు నెలల్లో బాలీవుడ్‌లో క్యూ కడుతున్న భారీ సినిమాలు.. సూర్యవంశీతో మొదలు కానున్న జాతర..


  ఇక జనవరి 14న విడుదల ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ నిర్మాతలు మాత్రం రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసే ప్రసక్తి లేదంటూ చెప్పారట. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా విడుదల చేయాల్సిందే అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం నిర్మాతలు తీసుకున్న ఫైనాన్స్ కూడా తడిసిమోపడైంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి జనవరి 14న ‘రాధే శ్యామ్’ విడుదల కానుంది.

  Chiranjeevi As God Father : గాయం తర్వాత హైదరాబాద్‌లో ‘గాడ్ ఫాదర్’ రెగ్యులర్ షూటింగ్‌లో జాయిన్ అయిన చిరంజీవి..


  ఇంత గట్టి పోటీలో కూడా నాగార్జున అక్కినేని ...నేనున్నంటూ బంగార్రాజు మూవీతో బరిలో దిగబోతున్నట్టు సమాచారం. అంతేకాదు బంగార్రాజు మూవీపై నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే థియేట్రికల్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌తో చర్చలు పూర్తైయినట్టు సమాచారం. మొత్తంగా సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’తో ప్రభాస్ .. ‘రాధే శ్యామ్’తో పాటు నాగార్జున ‘బంగార్రాజు’ పోటీ పడటం ఫైనల్ అని చెబుతున్నారు టాలీవుడ్ సినీ వర్గాలు. త్వరలో ఆయా సినిమాల రిలీజ్ డేట్స్ పై అఫీషియల్ ప్రకటనలు వెలుబడే అవకాశాలున్నాయి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bangarraju, Bheemla Nayak, Jr ntr, Mahesh Babu, Nagarjuna Akkineni, Pawan kalyan, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Sarkaru Vaari Paata

  ఉత్తమ కథలు