Home /News /movies /

RAJAMOULI RRR DIRECTOR SPECIAL CONGRATS TO PAWAN KALYAN BHEEMLA NAYAK AND MAHESH BABU SARKARU VAARI PAATA TEAMS TO POSTPONE HIS MOVIES TA

Rajamouli : పవన్ కళ్యాన్, మహేష్ బాబులకు రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు..

రాజమౌళి (Twitter/Photo)

రాజమౌళి (Twitter/Photo)

Rajamouli : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే యేడాది జనవరి 7న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్,అజయ్ దేవ్‌గణ్‌ హీరోలుగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) (రౌద్రం రణం రుధిరం’ సినిమా విడుదల కానుంది.

ఇంకా చదవండి ...
    Rajamouli : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే యేడాది జనవరి 7న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్,అజయ్ దేవ్‌గణ్‌ హీరోలుగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) (రౌద్రం రణం రుధిరం’ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా విడుదల తేది కంటే ముందు మహేష్ బాబు.. ’సర్కారు వారి పాట’సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు జనవరి 12న పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. మరోవైపు జనవరి 14న ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మహేష్ బాబు.. తన ’సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1కి పోస్ట్‌పోన్ చేశారు. నెక్ట్స్ రాజమౌళితోనే సినిమా కాబట్టి.. సూపర్ స్టార్ వెనక్కి తగ్గారు.

    ఇక పవన్ కళ్యాణ్ చివరి నిమిషం వరకు తన సినిమా ‘భీమ్లా నాయక్’ సినిమాను జవనరి 12న రిలీజ్ చేయాలనే పట్టుమీదున్నారు. కానీ చివరకి రాజమౌళి దౌత్యంతో పవన్ కళ్యాణ్ తన ‘భీమ్లా నాయక్’ సినిమాను ఫిబ్రవరి 25కు పోస్ట్ పోన్ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ మూవీని ఏప్రిల్ 29వ తేదికి మళ్లించారు. ఆ డేట్‌లో రావాల్సిన పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీ ‘ హరి హర వీరమల్లు’ సినిమాను దసరాకు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

    మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం తమ సినిమా విడుదల తేదిలను పోస్ట్‌పోన్ చేసుకున్న మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టీమ్‌తో పాటు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టీమ్‌ మెంబర్స్‌కు రాజమౌళి ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ ‘భీమ్లా నాయక్’ సరైన సినిమాలు. వాటిని పోస్ట్ పోన్ చేసినందుకు పవన్, మహేష్‌లతో పాటు నిర్మాత దిల్ రాజుకు రాజమౌళి స్పెషల్‌గా కంగ్రాట్స్‌ చెప్పారు.



    ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ఈ సినిమాలో  గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) నటించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ (Ram Charan)‌ యాక్ట్ చేశారు.  ‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌కు హైలైట్. ఇక పులి ఎదురుగా ఎన్టీఆర్ కూడా దాని మొహంలో మొహం పెట్టి గట్టిగా అరవడం మరో హైలైట్. రాజమౌళి ఈ సినిమా కోసం నాలుగేళ్లు ఎందుకు తీసుకున్నాడో ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ట్రైలర్‌లో చాలా వరకు ఎన్టీఆర్, చరణ్ కలిసున్న సన్నివేశాలే ఉన్నాయి.




    బాలీవుడ్‌ హీరోయిన్ ఆలియా భట్‌, హీరో అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా కనిపిస్తుంది. హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌.. తారక్‌కు జోడీగా నటించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న నటులు చాలా మంది ఇందులో ఉన్నారు. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.. అల్లూరిగా రామ్ చరణ్ కేక పెట్టించాడు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాత. ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నాడు. పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మితమైన RRR సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పోటీగా ఒక్క ‘రాధే శ్యామ్’ ఒక్కటే జనవరి 14న రిలీజ్ కానుంది.  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bheemla Nayak, Jr ntr, Mahesh babu, Pawan kalyan, Ram Charan, RRR, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు