Rajamouli: రాజమౌళి అసహనం వ్యక్తం చేసిన వేళ.. ఇంతకీ ఏం జరిగిందంటే..

రాజమౌళి (Rajamouli)

Rajamouli: దర్శక బాహుబలి రాజమౌళి అసహనం వ్యక్తం చేసిన వేళ.. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Share this:
    Rajamouli: రాజమౌళి అసహనం వ్యక్తం చేసిన వేళ.. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాహుబలి సినిమాతో రాజమౌళికి దేశ వ్యాప్తంగా ఎంతో  క్రేజ్ పెరిగింది. దీంతో ఈయనతో సినిమాలు ఎపుడు చేద్దామా అని బడా స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారు. వృత్తి రీత్యా రాజమౌళి ఎంతో బిజీగా ఉంటారు. ఒకవైపు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పనులు చేస్తూనే మరోవైపు ఇతర పనులను చక్కబెడుతున్నారు. రీసెంట్‌గా పని రీత్యా రాజమౌళి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కానీ అక్కడి పరిస్థితులు చూసి జక్కన్న తీవ్ర అసహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

    బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటకు దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాజమౌళికి అక్కడి సిబ్బంది ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం కొన్ని పత్రాలు ఇచ్చి వాటిలో సరైన సమాచారాన్ని ఇవ్వమన్నారు. ఆ ఫారమ్ నింపడానికి కొంత మంది ప్రయాణికుకలు గోడలకు అదిమిపెట్టి రాసిచ్చారు. ఇంకొందరు కింద కూర్చుని ఈ ఫారమ్ నింపి ఎయిర్‌పోర్ట్ అధికారులకు అందజేసారు. ఈ విషయమై రాజమౌళి స్పందిస్తూ ఇటువంటి వాటికోసం అక్కడ చిన్న టేబుల్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.




    మరోవైపు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే.. పదులో సంఖ్యలో వీధి కుక్కలున్నాయి. వీటిని చూస్తే విదేశీయులకు మనపై దురభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దయచేసి ఎయిర్‌పోర్ట్ అధికారులు ఇటువంటి చిన్న చిన్న విషయాలపై ఫోకస్ పెడితే బాగుంటుదని కోరారు.

    RRR Update Netizens Trolling NTR Ram Charan New Poster Do not Wearing Helmet,RRR: ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ పై నెటిజన్స్ ట్రోలింగ్స్.. ఆ విషయమై ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను టార్గెట్ చేస్తూ..,rrr movie,Jr NTR,Ram Charan, NTR Ram Charan Not Wear Helmet,rrr movie twitter,rrr movie shooting,rrr movie new poster,ram charan ntr bike poster,rrr movie shooting completed 2 songs balance,telugu cinema,ట్రిపుల్ ఆర్ షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తి,2 భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసిన చరణ్ తారక్,హెల్మెట్ లేకుండా రామ్ చరణ్ ఎన్టీఆర్
    ట్రిపుల్ ఆర్ న్యూ పోస్టర్ (RRR movie)


    రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. ఈయన ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’(RRR) రౌద్రం రణం రుధిరం అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ పూర్తైయింది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగుతో పాటు హిందీ డబ్బింగ్ పనులను ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్ట్ చేసారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: