• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJAMOULI RESPOND ON MAHESH BABU MOVIE HERE ARE THE DETAILS TA

Rajamouli-Mahesh Babu: మహేష్ బాబు మూవీపై స్పందించిన రాజమౌళి..

Rajamouli-Mahesh Babu: మహేష్ బాబు మూవీపై స్పందించిన రాజమౌళి..

మహేష్ బాబు, రాజమౌళి (File/Photo)

Rajamouli-Mahesh Babu | మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఒక వేళ అన్ని కుదిరి వుంటే.. బాహుబలి కంటే ముందు మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయాల్సింది. తాజాగా మహేష్ బాబుతో చేయాల్సిన స్టోరీపై రాజమౌళి స్పందించారు.

  • Share this:
    Rajamouli-Mahesh Babu: మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఒక వేళ అన్ని కుదిరి వుంటే.. బాహుబలి కంటే ముందు మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయాల్సింది. కానీ రాజమౌళి .. బాహుబలి తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. తెలుగులో ఈ  చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  కారణంగా ఆగిపోయింది. అయితే ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినా.. కానీ ఎన్టీఆర్, చరణ్ మాత్రం కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత కానీ షూటింగ్స్‌లో పాల్గొనబోమని ఖరాఖండిగా చెప్పారు. ఇంతలో రాజమౌళి, నిర్మాత దానయ్యకు కరోనా సోకింది. ప్రస్తుతం వీళ్లిద్దరు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాజమౌళి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టే పని హడావుడిలో ఉన్నారు. తొందర్లనే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభించనున్నాడు.  ఈ సందర్భంగా రాజమౌళి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌తో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

    మహేష్ బాబు, రాజమౌళి (File/Photo)


    ప్రస్తుతం రెండు నెలలు పాటు ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తానన్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి మహేష్ బాబు సినిమాపై ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.   ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో మహేష్ బాబు కోసం అద్భుతమైన స్టోరీ రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక రాజమౌళి కూడా బాహుబలి నుంచి తన సినిమాలను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.

    మహేష్ బాబు, రాజమౌళి (File/Photo)


    ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం అదిరిపోయే స్టోరీ లైన్ రెడీ చేసినట్టు ప్రచారం జరిగింది. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమాను జేమ్స్ బాండ్ లేకపోతే.. కౌబాయ్ తరహా యాక్షన్ మూవీ అని రాజమౌళి సన్నిహిత వర్గాలు చెప్పాయి.ఈ విషయమై రాజమౌళిని అడిగితే.. ఒక సినిమా చేసేటపుడు మరో సినిమా గురించి ఆలోచించనన్నారు. ముందు నుండి నేనింతే అన్నారు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే కానీ మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయాలనే దానిపై ఆలోచించనన్నారు. దీంతో మహేష్ బాబుతో ఏ తరహా సినిమా చేయాలనే దానిపై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టాడు రాజమౌళి. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కోసం తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో ఎలాంటి సబ్జెక్ట్‌ రెడీ చేయిస్తాడనేది చూడాలి.

    రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
    రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)


    ఇక రాజమౌళి కూడా తాను ఏ సినిమా తెరకెక్కించినా.. ముందుగానే ఆ సినిమా స్టోరీ ఏంటనేది ముందుగానే చెప్పేస్తుంటాడు. ఒక విధంగా కథ చెప్పి తన సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం రాజమౌళికి ముందు నుంచే ఓ అలవాటు ఉంది. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కాంబినేషన్‌లో ఏ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు