‘బాహుబలి’ సిరీస్ సక్సెస్ తర్వాత అన్ని ఇండస్ట్రీస్‌లో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోవలో బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’ అనే అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాను ఒకేసారి మూడు పార్టులుగా సోషియో ఫాంటసీ కథాంశంతో హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను తాజాగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాాజాగా ఈ సినిమాను తెలుగు, తమిళంలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టైటిల్ లోగోను రాజమౌళి తన ట్విట్టర్లో రిలీజ్ చేసారు. ప్రపంచంలో ఏదైనా ఒక అస్త్రం ఉన్నాదా... అది కలిపితే గుండ్రంగా ఉంటుంది. దానిపై ఒక గుర్తు కూడా ఉంది అంటూ రణ్వీర్ కపూర్ అడుగుతుంటాడు. దానికి నాగార్జున అదే మొత్తం బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా నింపుకున్న అద్వితీయ అస్త్రం బ్రహ్మాస్త్రం అని చెబుతాడు.
అది నాకే ఎందుకు కనబడుతుంది అని రణ్వీర్ అడుగుతుంటే.. ఆ బ్రహ్మాస్త్రం యొక్క ఆఖరి యుద్దం నీతో ముడిపడి ఉంది అని చెబుతాడు. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్ లోగోను ఈ సినిమాలో నటించే అమితాబ్,రణ్‌బీర్, ఆలియాల వాయిస్‌తో రిలీజ్ చేసారు. తెలుగులో నాగార్జున వాయిస్‌తో ఈసినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేయడం విశేషం.

బ్రహ్మాస్త్ర టైటిల్ లోగో
బ్రహ్మాస్త్రం మూడు భాగాలుగా చూపించినట్టు ఈ సినిమాను కూడా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి టైటిల్ లోగోతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మూవీ మేకర్స్ సినిమాతో ఎలాంటి సంచనాలు నమోదు చేస్తారో చూడాలి. ఇప్పటికే మహాశివరాత్రి సందర్భంగా 150 డ్రోన్ కెమెరాలతో ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఈ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను క్రిస్మస్ కానుగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్...నమిత్ మల్హోత్రకు చెందిన ఫాక్స్ స్టార్ స్టూడియోళ్లతో కలిసి తెరకెక్కిస్తున్నాడు.