RRR - Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌’.. గిఫ్ట్ రెడీ చేస్తున్న రాజమౌళి, అస‌లు ట్విస్ట్ అదే..!

Rajamouli ready give a surprise of RRR on republic day

RRR - Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్ర ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు సంబంధించి జక్కన్న ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆ ప్లానేంటి చూడండి...

  • Share this:
    ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’(రౌద్రం ర‌ణం రుధిరం). పిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం స్వాతంత్య్రం ముందు ఇద్ద‌రు పోరాట వీరులకు సంబంధించిన ఫిక్షనల్‌ స‌బ్జెక్ట్‌. ప్రీ ఇండిపెండెన్స్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ గిఫ్ట్‌ను రాజ‌మౌళి సిద్ధం చేస్తున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి ఉండే పోస్ట‌ర్ లేదా చిన్న వీడియో ప్రోమోను విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంద‌నేది రాజ‌మౌళి ఆలోచ‌న‌గా కనిపిస్తోంది. అయితే ఇక్క‌డొక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఈ పోస్ట‌ర్ లేదా వీడియో ప్రోమోను కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా కాకుండా.. రిప‌బ్లిక్ పండుగ రోజు జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

    ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుంటే.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం ప్రాంతానికి చెందిన పోరాట వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న ఇద్ద‌రి వీరులకు సంబంధించిన క‌ల్పిత‌గాథ‌. ఆ పాయింట్ కార‌ణంగా రాజ‌మౌళి ట్రిపులార్ టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ప్యాన్ ఇండియా సినిమాగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా నుండి ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌, రామ‌రాజు ఫ‌ర్ భీమ్‌, భీమ్ ఫ‌ర్ రామ‌రాజు వీడియో టీజ‌ర్స్ విడుద‌లై ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.

    ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ స‌హా బాలీవుడ్ తార‌లు ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ స‌హా కోలీవుడ్ నుండి స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ద‌స‌రాకు ఈ సినిమా విడుద‌ల‌య్యే అవకాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం.
    Published by:Anil
    First published: