Home /News /movies /

RRR మూవీ రిలీజ్ వాయిదా... కొత్త డేట్ ఎప్పుడంటే...

RRR మూవీ రిలీజ్ వాయిదా... కొత్త డేట్ ఎప్పుడంటే...

RRR ఫ్యాన్ మేడ్ పోస్టర్స్

RRR ఫ్యాన్ మేడ్ పోస్టర్స్

RRR సినిమా రిలీజ్ వాయిదా పడింది. సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించారు.

    ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు కొంతకాలంగా వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. RRR సినిమాను ముందుగా ప్రకటించిన విధంగా 2020 జూలై 30వ తేదీన కాకుండా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదని... అందుకే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. RRR సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కొన్ని నెలల పాటు ఇతర సినిమాలకు దూరంగా ఉంటున్నారు.



    ప్రస్తుతం RRR షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర సెట్‌లోకి అజయ్ దేవ్‌గన్ వచ్చి కూడా కొద్ది రోజులే అవుతోంది. అయితే ఇప్పటి వరకు హీరోలతో మాత్రం ఈయన కాంబినేషన్ సెట్ కాలేదని తెలుస్తోంది. అయితే తొలిరోజు రామ్ చరణ్‌తో కలిసి పని చేసాడు అజయ్. దాంతో సినిమా యూనిట్ అంతా కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా రామ్ చరణ్, అజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయని.. ఇందులో చరణ్ తండ్రిగా అజయ్ దేవ్‌గన్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు పాత్రకు స్వాతంత్ర్య కాంక్ష్య రగిలించేలా అజయ్ దేవ్‌గన్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి చరణ్ చిన్నప్పటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో విడుదల కానుంది RRR.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jr ntr, Ram Charan, RRR, SS Rajamouli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు