Home /News /movies /

ఆర్ఆర్ఆర్ విషయమై ఫ్యాన్స్‌కు రాజమౌళి బిగ్‌షాక్.. కొత్త రిలీజ్ డేట్ ఎపుడంటే..

ఆర్ఆర్ఆర్ విషయమై ఫ్యాన్స్‌కు రాజమౌళి బిగ్‌షాక్.. కొత్త రిలీజ్ డేట్ ఎపుడంటే..

RRR మూవీ ప్రెస్ మీట్

RRR మూవీ ప్రెస్ మీట్

ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ఎపుడంటే..

ఇంకా చదవండి ...
ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో  రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ముఖ్యంగా రామ్ చరణ్,ఎన్టీఆర్ లపై క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ మిగిలి ఉంది. దీని కోసమే దాదాపు రూ. 85 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్టు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తోంది.

‘RRR’ చిత్రాన్ని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.


అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్ర విడుదల తేదీపై మాత్రం మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాడు రాజమౌళి. సినిమా 10 భాషల్లో 2020లో విడుదలవుతుందని ఆ మధ్య ప్రెస్ నోట్ ఇచ్చాడు కానీ జులై 30 అని మాత్రం అందులో చెప్పలేదు. దాంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. రీసెంట్‌గా మత్తు వదలరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమ ా అప్‌డేట్స్ గురించి అడగొద్దని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ సినిమా 2020 అక్టోబర్‌లో దసరా సందర్భంగా రిలీజయ్యే అవకాశాలున్నాయని ఆయన ట్వీట్‌తో స్పష్టమైంది.ముఖ్యంగా తెలుగులో రిలీజ్ డేట్లు ఎప్పటి కప్పుడు ఛేంజ్ చేసుకున్న పర్వాలేదు కానీ.. బాలీవుడ్ సినిమాల రిలీజ్ విషయంలో వాళ్లు పక్కగా ఉంటారు. ఆర్నెళ్లు, యేడాది ముందుగానే థియేటర్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోతాయి. ఇక బాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా విడుదల విషయమై రాజమౌళిని అడిగినట్టు సమాచారం. ఒకవేళ చెప్పిన డేట్‌లో రిలీజ్ కాకపోతే.. వేరే సినిమాలు ఆ టైమ్‌లో షెడ్యూల్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అందుకే  రాజమౌళి వివిధ భాషల్లో డబ్బింగ్, ఇతర కార్యక్రమాలకు ఎంత లేదన్న మరో రెండు నెలల టైమ్  పట్టేటట్టు ఉంది.
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ విషయమై రాజమౌళిని బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్  అఫీషియల్ ప్రకటన విడుదల చేయమని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. త్వరలోనే జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ విషయమై ఏ  సమయంలోనైనా అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood, Jr ntr, Ram Charan, RRR, SS Rajamouli, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు