RAJAMOULI RAM CHARAN JR NTR RRR MOVIE WORLDWIDE PRE RELEASE BUSINESS PK
RRR Pre release business: ‘RRR’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ‘బాహుబలి 2’ కంటే 80 కోట్లు ఎక్కువే..!
NTR Ram Charan RRR Movie Photo : Twitter
RRR Pre release business: ‘RRR’.. ఇప్పుడు ఈ చిత్రం గురించే ఇండియా అంతా మాట్లాడుకుంటుంది. ఇప్పటికే పాన్ ఇండియన్ సినిమాల హడావిడి కూడా మొదలు కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఓ వైపు రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు.. మరోవైపు ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) లాంటి స్టార్ హీరోలు కలిసి చేసిన సినిమా కావడంతో అంచనాలు అలాగే ఉన్నాయి.
‘RRR’.. ఇప్పుడు ఈ చిత్రం గురించే ఇండియా అంతా మాట్లాడుకుంటుంది. ఇప్పటికే పాన్ ఇండియన్ సినిమాల హడావిడి కూడా మొదలు కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఓ వైపు రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు.. మరోవైపు ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) లాంటి స్టార్ హీరోలు కలిసి చేసిన సినిమా కావడంతో అంచనాలు అలాగే ఉన్నాయి. పైగా తెలుగులో దాదాపు 40 ఏళ్ళ తర్వాత వస్తున్న అసలు సిసలైన మల్టీస్టారర్ ఇది. ఒకే ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో.. అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు. అందుకే అంతా మార్చి 25 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇండియా అంతా రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తిరుగుతూనే ఉన్నారు. ఈ సినిమాను పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. కచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ఈ హీరో తక్కువ.. ఆ హీరో ఎక్కువా అనే లెక్కలు లేకుండా ఓ ఎమోషనల్ ఫీలింగ్‌తో థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటికి వస్తారని నమ్మకంగా చెప్తున్నాడు రాజమౌళి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలోనూ రికార్డు బిజినెస్ చేసారు. బాహుబలి 2 కంటే 80 కోట్లు ఎక్కువగానే ఈ సినిమాను అమ్మారు. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటో చూద్దాం..
ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. అక్షరాలా 455 కోట్లు షేర్ వసూలు చేయాలి. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ ఈ సినిమాకు రికార్డు వసూళ్లు రావాల్సిందే. మరోవైపు తమిళం, మలయాళంలోనూ రికార్డు రేట్‌కు సినిమాను అమ్మేసారు. కర్ణాటకలో 50 కోట్లు వస్తే కానీ హిట్ అనిపించుకోదు. అన్నిచోట్లా ఈ సినిమాకు రికార్డు బిజినెస్ జరిగింది. మరి చూడాలి.. మార్చ్ 25 నుంచి రచ్చ ఎలా ఉండబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.