Rajamouli : నా కన్న ఆ దర్శకుడు తోపు.. ఆర్ఆర్ఆర్ (RRR) ’రౌద్రం రణం రుధిరం’ ప్రమోషన్లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా దర్శక బాహుబలి రాజమౌళి శ్రీకాకుళంలోని ఓ కాలేజ్‌లో జరిగిన వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు రాజమౌళిని పలు ఆసక్తికర ప్రశ్నలు వేసారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థి .. మీరు ప్రభాస్(Prabhas)తో మళ్లీ ఎపుడు సినిమా చేస్తారు అని అడిగారు. ఈ ప్రశ్నకు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ఆర్ఆర్ఆర్ సహా వరుసగా పలు సినిమాలతో బిజీగా ఉన్నాను. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయనతో పనిచేసే అవకాశం ఎపుడు వస్తుందో చూడాలన్నారు. వస్తే తప్పకుండా చేస్తానని సరదాగా అన్నారు.
ఈ సందర్భంగా ప్రభాస్‌ను బాహుబలి కంటే ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘బుజ్జిగాడు’ సినిమాతో నటుడిగా రాటుతేలారు. ఆయన దర్శకత్వంలో నటుడిగా ప్రభాస్ రాటుతేలారన్నారు. ప్రభాస్ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను ‘బద్రి’ సినిమాతో ఇమేజ్ మార్చారు. అటు ’పోకిరి’తో మహేష్ బాబులోని నటుడిని వెలికితీసింది కూడా పూరీ జగన్నాథ్. ఇక ‘టెంపర్’ సినిమాలో ఎన్టీఆర్లోని డిఫరెంట్ నటుడిని వెలికి తీసింది కూడా పూరీ జగన్నాథే అని చెప్పుకొచ్చారు రాజమౌళి.
ఇక ‘చిరుత’ సినిమాతో రామ్ చరణ్.. ‘దేశ ముదురు’ సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ను.. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ..ఓ తమిళ అమ్మాయి’ సినిమాలతో రవితేజ్ వంటి తదితర నటుల ఇమేజ్ను ఛేంజ్ చేసింది కూడా పూరీ జగన్నాథే అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
NTR Jr - Evaru Meelo Koteeswarulu: ’ఎవరు మీలో కోటీశ్వరులు’ 9వ వారంలో మరోసారి సత్తా చాటిన ఎన్టీఆర్..
ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. గతంలో పూరీ జగన్నాథ్.. బాలీవుడ్లో ‘షర్త్’, ‘బుడ్డా హోగా తేరా బాప్’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ‘ఫైటర్’ తర్వాత బాలయ్య, సల్మాన్‌లతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు.
Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..
ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్‌లతో తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వచ్చే యేడాది జనవరి 7న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్‌ను రాజమౌళి ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఫైనల్‌గా 3 గంటల 15 నిమిషాలు వచ్చిందట.
చివరగా జక్కన్న ఈ సినిమాను ట్రిమ్ చేసి చివరగా 2 గంటల 45 నిమిషాలకు అన్ని భాషల్లో ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇధే ఫైనల్ అని కూడా చెబుతున్నారట. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్‌లో నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Puri Jagannadh, Rajamouli, RRR, Tollywood