Prabhas : రాజమౌళి సినిమాకు దర్శకత్వం వహించనున్న ప్రభాస్ దర్శకుడు..

Prabhas : బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా చత్రపతిని రీమేక్ చేస్తోన్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: November 24, 2020, 9:23 AM IST
Prabhas : రాజమౌళి సినిమాకు దర్శకత్వం వహించనున్న ప్రభాస్ దర్శకుడు..
రాజమౌళి Photo : Twitter
  • Share this:
బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా చత్రపతిని రీమేక్ చేస్తోన్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఈ సినిమాకు సాహోతో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తాడట. ఈ విషయం పై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక చత్రపతి సినిమా విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన యాక్షన్ డ్రామా ఛత్రపతి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ, అమ్మ సెంటిమెంట్ గానీ సినిమాలో మంచి కిక్‌ను ఇస్తాయి. చెప్పాలంటే ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచిన చిత్రం. ఒకటిన్నర దశాబ్దం క్రితం తెలుగునాట సంచలనం సృష్టించింన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందని తెలుస్తోంది. ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కి అనుకూలంగా ఉండటం కోసం సెకండాఫ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్ కథను కొంత మారుస్తున్నారని టాక్. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఈ సినిమాలో బెల్లంకొండ ఎలా చేస్తాడో చూడాలి మరి.

ఇక బెల్లంకొండ చాలా సంవత్సరాల తర్వాత రాక్షసుడు పేరుతో ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు. తమిళ్‌లో ఘన విజయం సాధించిన రాట్సాసన్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో రవివర్మ డైరెక్ట్ చేశాడు. సినిమాలో కథ కథానాలతో పాటు ఒరిజినాలిటీని ఎక్కడా పాడుచెయ్యకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసిన ఈ చిత్రం తెలుగులో కూడా విమర్శకుల ప్రశంసల్నీ పొందింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా చేసిన బెల్లంకొండకు తన కెరీర్‌లోని బిగ్గేస్ట్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ చేసింది. అది అలా ఉంటే.. బెల్లంకొండ చేసిన దాదాపు అన్ని సినిమాలు దాదాపుగా హిందీలో అనువాదమయ్యాయి. తెలుగులో ప్లాప్ అయ్యినా కూడా హిందీలో డబ్ చేసే వారు. ముఖ్యంగా ఆయన సినిమాలు యూట్యూబ్ వేదికగా ఎవరు ఊహించని విధంగా వ్యూస్ తెచ్చుకుంటూ సంచలనం సృష్టించాయి. అలాడే డబ్బింగ్ అండ్ శాటిలైట్స్ పరంగానూ లాభాల బాట పట్టాయి.

ajamouli prabhas chatrapathi hindi remake, Prabhas, Bellamkonda, Sara ali khan and ananya pandey,Bellamkonda sai srinivas to remake prabhas chatrapathi in hindi ,chatrapathi hindi remake,ప్రభాస్, బెల్లంకొండ
ప్రభాస్, శ్రద్ధాలతో సుజీత్ Photo : Twitter


దీంతో ఈ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ.. శ్రీనివాస్ తో తెలుగులో బ్లాక్ బస్టర్ అయినా ప్రభాస్ 'ఛత్రపతి' ని హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. బెల్లంకొండ తెలుగులో అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీకే సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ కోసం ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు. కాగా బెల్లంకొండ హిందీ సినిమాలోను ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. హిందీ స్టార్ హీరోయిన్స్ సారా అలీ ఖాన్, అనన్య పాండేలు నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇందులో ఒకరు అనన్య పాండే తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తోన్న ఫైటర్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. చూడాలి మరి.. బెల్లంకొండ అదృష్టం ఎలా ఉందో.. ఇప్పటి వరకు అనువాదాలతో హిందీ బాబులను అలరించిన బెల్లంకొండ శ్రీనివాస్.. నేరుగా చేస్తున్న ఈ రీమేక్ తో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో. ఇక బెల్లంకొండ రాక్షసుడు హిట్ తర్వాత తెలుగులో ఆయన చేస్తోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: November 24, 2020, 9:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading