RRR సినిమా తర్వాత రాజమౌళి మరో భారీ మల్టీస్టారర్..

Rajamouli RRR: రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్‌తోనే చాలా బిజీగా గడిపేస్తున్నాడు దర్శక ధీరుడు. మరో ఏడాది వరకు ఈ సినిమా తప్ప మరో ప్రపంచం కూడా లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 16, 2020, 3:03 PM IST
RRR సినిమా తర్వాత రాజమౌళి మరో భారీ మల్టీస్టారర్..
దర్శకుడు రాజమౌళి (rajamouli)
  • Share this:
రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్‌తోనే చాలా బిజీగా గడిపేస్తున్నాడు దర్శక ధీరుడు. మరో ఏడాది వరకు ఈ సినిమా తప్ప మరో ప్రపంచం కూడా లేదు. ఓ సినిమా చేస్తున్నపుడు మరో సినిమా గురించి అస్సలు ఆలోచన చేయడు రాజమౌళి. కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఓ సినిమా చేస్తుండగానే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా సెట్ చేసుకుంటున్నాడు. ఈయన కోసం స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని వేచి చూస్తున్న వాళ్లకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్‌తో మల్టీస్టారర్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది.
దర్శకుడు రాజమౌళి (rajamouli)
దర్శకుడు రాజమౌళి (rajamouli)

దాంతో నెక్ట్స్ ఏం చేస్తాడనేది ఇప్పట్నుంచే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తర్వాతి సినిమా కూడా మల్టీస్టారర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా మరోసారి తెలుగు సినిమా సూపర్ స్టార్స్ ఇద్దరిని కలిపి సినిమా చేయడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి.

దర్శకుడు రాజమౌళి (rajamouli)
దర్శకుడు రాజమౌళి (rajamouli)

దర్శకధీరుడు కూడా దీన్ని కన్ఫర్మ్ చేసాడు. కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ చిత్రం ఉండబోతుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కూడా మరో హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. RRR తర్వాత ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ముందు RRR అనుకున్నపుడు కూడా జరగదేమో అనుకున్నారు కానీ ఇప్పుడు జరిగింది. అలాగే ప్రభాస్, మహేష్ సినిమా కూడా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. మరి అది జరిగితే అద్భుతమే.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు