Magadheera 2 | Rajamouli : మగధీర సీక్వెల్‌‌కు రాజమౌళి సన్నాహాలు.. హీరో ఎవరంటే..

Rajamouli Photo : Twitter

Ram Charan | Rajamouli : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో 2009లో మగధీర అనే పిరియాడిక్ సినిమా వచ్చి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే.

  • Share this:
    మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో 2009లో మగధీర అనే పిరియాడిక్ సినిమా వచ్చి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రామ్ చరణ్‌కు ఇటు రాజమౌళికి (Rajamouli)  ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. ఇక ఈ సినిమాతో (Ram Charan) రామ్ చరణ్‌ స్టార్ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఇక అది అలా ఉంటే పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్( Magadheera 2) రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా సాగుతున్నాయని అంటున్నారు. ఇక మరోవైపు ఈ సీక్వెల్‌కు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నరామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని డైరెక్టర్ శంకర్‌తో ఒక మూవీ చేస్తారట. ఇంతలోపు రాజమౌళి కూడా మహేష్ బాబుతో ఒక మూవీ చేస్తారని, ఆ రెండు సినిమాలు అయిపోగానే రాజమౌళి, రామ్ చరణ్ కలయికలో మగధీరకు సీక్వెల్‌గా మగధీర-2 రానుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

    ఇక రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న “రౌద్రం రణం రుధిరం” అనే భారీ ప్యాన్ ఇండియన్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కేవలం రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది. చూడాలి మరి అనుకున్న తేది ప్రకారం దసరాకు వస్తున్నారా లేక మరోసారి విడుదల వాయిదా పడనుందా అనేది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌తో పాటు కొరటాల శివ ఆచార్యలో నటిస్తున్నారు. కాజల్ చిరంజీవి సరసన నటిస్తుంటే.. పూజా హెగ్డే రామ్ చరన్ సరసన నటిస్తోంది.

    Rajamouli, Rajamouli news, Magadheera 2 news, Ram charan Magadheera 2, RRR release date, Ram charan latest news, మగధీర 2, రామ్ చరణ్, రాజమౌళి
    Magadheera Photo : Instagram


    ఈ రెండు చిత్రాల తర్వాత రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారు. రామ్‌చరణ్‌ సరసన హిందీ నటి అలియాభట్‌ లేదా కియారా అద్వానీని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్రబృందం. ప్రస్తుతం అలియా భట్‌ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌చరణ్‌ సరసన సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కియారా గతంలో రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామలో నటించారు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు తాజాగా వినిపిస్తోన్న టాక్.

    చరణ్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. “ఖైదీ”, “మాస్టర్” చిత్రాలతో తెలుగు, తమిళ భాషల్లో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్నట్లు తాజా సమాచారం. లోకేష్ కనగ రాజ్ చెప్పిన లైన్ రామ్ చరణ్ నచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కాంబినేషన్‌లో బహుశా ఓ సినిమా ఉండవచ్చని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: