మహేష్ బాబు, రాజమౌళి సినిమా జోనర్ అదేనా..?

Mahesh Babu Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి కూడా దాదాపు ఆరేళ్లవుతుంది. బాహుబలి కంటే ముందే ఈయనతో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు దర్శక ధీరుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 22, 2020, 5:15 PM IST
మహేష్ బాబు, రాజమౌళి సినిమా జోనర్ అదేనా..?
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
  • Share this:
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి కూడా దాదాపు ఆరేళ్లవుతుంది. బాహుబలి కంటే ముందే ఈయనతో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు దర్శక ధీరుడు. అయితే ఇద్దరూ వరస సినిమాలతో బిజీగా ఉండటంతో మహేష్ బాబుతో రాజమౌళి సినిమా వర్కవుట్ కావడం లేదు. అయితే ఇప్పుడు మాత్రం కచ్చితంగా మహేష్ సినిమాను పూర్తి చేస్తానంటున్నాడు రాజమౌళి. ఇప్పుడు సెట్స్‌పై ఉన్న ట్రిపుల్ ఆర్ తర్వాత వెంటనే మహేష్ బాబు సినిమా పట్టాలెక్కుతుందని కన్ఫర్మ్ చేసాడు జక్కన్న. దాంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)


రాజమౌళితో సినిమా చేస్తే అది ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి మామూలు సినిమాలు చేయడం మానేసాడు. ఈయన ఎంచుకుంటున్న జోనర్స్ కూడా పాన్ ఇండియన్ లెవల్లో ఉంటున్నాయి. కేవలం ఒక భాషను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం మానేసాడు రాజమౌళి. దాంతో సూపర్ స్టార్‌తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందా అని ఇప్పట్నుంచే అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)

దీనికి సమాధానంగా జేమ్స్ బాండ్ తరహా కథ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. గతంలో బిజినెస్‌మేన్ ఆడియో వేడుకకు వచ్చినపుడు మహేష్‌తో ఎలాంటి సినిమా చేయాలని అభిమానులను అడిగితే చాలా మంది జేమ్స్ బాండ్ కథ కావాలన్నారని చెప్పాడు రాజమౌళి. దీంతో అలాంటి కథనే ఇప్పుడు వండుతున్నారని తెలుస్తుంది. జేమ్స్ బాండ్ తరహా కథ అయితే పాన్ ఇండియన్ స్థాయి కూడా ఉంటుంది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే.
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)

నిజంగానే మహేష్ కోసం అలాంటి కథ సిద్ధం చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా అయితే ఉంది కానీ కథ ఇంకా ఏం అనుకోలేదని చెప్పాడు రాజమౌళి. రెండు మూడు కథలు అనుకున్నా కూడా పెద్దగా ఎక్జైటింగ్‌గా అనిపించలేదని చెప్పాడు దర్శక ధీరుడు. మొత్తానికి చూడాలిక.. ఈ కాంబినేషన్‌లో రాబోయే తొలి సినిమా ఎలా ఉండబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: April 22, 2020, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading