ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి అదిరిపోయే ప్లాన్.. జక్కన్న నువ్వు మాములోడివి కాదు..

RRR Rajamouli | ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కోసం జక్కన్నఏం చేయబోతున్నాడంటే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 20, 2020, 9:50 AM IST
ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి అదిరిపోయే ప్లాన్.. జక్కన్న నువ్వు మాములోడివి కాదు..
దర్శకుడు రాజమౌళి (Rajamouli)
  • Share this:
ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా, నందమూరి వంటి మాస్ హీరోలతో  రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ముఖ్యంగా రామ్ చరణ్,ఎన్టీఆర్ లపై క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ మిగిలి ఉంది. దీని కోసమే దాదాపు రూ. 85 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్టు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తోంది.రామ్ చరణ్ సరసన ఆలియా భట్ యాక్ట్ చేస్తోంది.  అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ యాక్ట్ చేస్తోంది.ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)


తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం రాజమౌళి  సరికొత్త ప్రమోషన్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం రాజమౌళి ప్రత్యేకంగా ఒక ప్రమోషనల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి బాలీవుడ్‌లో ఇలాంటి ప్రమోషనల్ సాంగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. తెలుగులో ఇలాంటి ప్రమోషనల్ సాంగ్స్ ఒకటి రెండు ఉన్నా ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ కాలేదు. కానీ ప్యాన్ ఇండియా లెెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేశభక్తి నేపథ్యంలో ఒక ప్రమోషనల్ సాంగ్‌ను రెడీ చేస్తున్నాడట. ఇప్పటికే కీరవాణి దేశ భక్తికి సంబంధించిన ప్రమోషనల్ సాంగ్‌కు సంబంధించిన ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట. ఈ పాటను ఆగష్టు 15న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. మొత్తానికి రాజమౌళి చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం ఈ ప్రయోగం ఎంచుకోవడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 20, 2020, 9:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading