HOME » NEWS » movies » RAJAMOULI OPEN UP ABOUT MEGASTAR CHIRANJEEVI PAWAN KALYAN MULTISTARRER MOVIE PK

పవన్ కళ్యాణ్, చిరంజీవితో మల్టీస్టారర్.. రాజమౌళి క్లారిటీ..

Pawan Kalyan Chiranjeevi: కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ సెట్ చేయడంలో రాజమౌళి ముందుంటాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ టాప్ హీరోలను ఒకే సినిమాలో కలిపి చూపించడం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 21, 2020, 2:22 PM IST
పవన్ కళ్యాణ్, చిరంజీవితో మల్టీస్టారర్.. రాజమౌళి క్లారిటీ..
పవన్ కళ్యాణ్ చిరంజీవి రాజమౌళి (pawan rajamouli chiranjeevi)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అగ్ర దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్ కూడా ఈయన ఆలోచనల ముందు మోకరిల్లుతుంది. అంతగా తన మార్కెట్ విస్తరించుకున్నాడు దర్శక ధీరుడు. ఇదిలా ఉంటే కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ సెట్ చేయడంలో రాజమౌళి ముందుంటాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ టాప్ హీరోలను ఒకే సినిమాలో కలిపి చూపించడం అనేది ఏ దర్శకుడికైనా కూడా కలే.. అలాంటి సాహసం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే ఇద్దరు హీరోల ఇమేజ్ అలాంటిది.. ఫ్యాన్ బేస్ అలాంటిది. అలాంటి సూపర్ స్టార్స్‌తో మల్టీస్టారర్ చేయడం అనేది చిన్న విషయం కాదు.
పవన్ కళ్యాణ్ చిరంజీవి (pawan chiranjeevi)
పవన్ కళ్యాణ్ చిరంజీవి (pawan chiranjeevi)


అలాంటిదిప్పుడు రాజమౌళి దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఆర్ఆర్ఆర్ త్వరలోనే రాబోతుంది కూడా. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి కాంబినేషన్‌లో కూడా మల్టీస్టారర్ చేసే ఆలోచన రాజమౌళి బుర్రలో ఉందా..? ఈ ప్రశ్నకు కూడా ఇప్పుడు సమాధానమిచ్చాడు రాజమౌళి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆలోచనతో తనకు సెట్ అవ్వదని ఓపెన్‌గానే చెప్పేసాడు ఈయన. అలాంటిది చిరుతో సినిమా కోసం కూడా చాలా ఏళ్లు ప్రయత్నించానని కూడా చెప్పాడు. అయితే పవన్, చిరు కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చేస్తారా అని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలన్నాడు దర్శక ధీరుడు.
పవన్ కళ్యాణ్ రాజమౌళి (pawan rajamouli)
పవన్ కళ్యాణ్ రాజమౌళి (pawan rajamouli)

అది మనం డిసైడ్ చేయకూడదు.. స్క్రిప్ట్ వస్తే చేయొచ్చండి అన్నాడు జక్కన్న. చేయనని చెప్పకుండా కథ డిమాండ్ చేస్తే చూద్దామన్నాడు రాజమౌళి. కానీ అలాంటి కథలు పుట్టడానికి చాలా కష్టం అవుతుందని కూడా చెప్పాడు ఈయన. ఆ మధ్య సుబ్బిరామిరెడ్డి కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో త్రివిక్రమ్ సినిమా చేస్తాడని ప్రకటించాడు. అయితే పవన్ కళ్యాణ్ దాన్ని కొట్టి పారేసాడు. చిరు కూడా అంతే.
Published by: Praveen Kumar Vadla
First published: April 21, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading