వామ్మో... RRR ఓవర్సీస్ రైట్స్‌ అంతకు అమ్ముడు పోయిందా..

ప్రస్తుతం తెలుగుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర కథానాయకులు ఈసినిమాలో యాక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడపోయాయి.

news18-telugu
Updated: June 14, 2019, 8:43 AM IST
వామ్మో... RRR ఓవర్సీస్ రైట్స్‌ అంతకు అమ్ముడు పోయిందా..
RRR సినిమా ప్రెస్ మీట్లో ఎన్టీఆర్,రామ్ చరణ్,రాజమౌళి
  • Share this:
ప్రస్తుతం తెలుగుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర కథానాయకులు ఈసినిమాలో యాక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈసినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ సినిమాకు కీలమైన ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు స్వాతంత్య్ర సమరయోధులైన కొమరం భీమ్,అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే దాదాపు రూ.22 కోట్లకు పైగా ఖర్చుక పెడుతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దుబాయికి చెందిన ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్త అన్ని భాషలకు కలిపి ఈ సినిమా రైట్స్‌ను రూ. 65 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మరోవైపు చైనా విడుదల హక్కులు మాత్రం ఆయనకు ఇవ్వలేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే యేడాది జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 14, 2019, 8:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading