RRR టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఖరారు..

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఐతే.. ‘RRR’ టైటిల్ పై ఇప్పటికే  పలు ఊహాగానాలు వెలుబడటంతో  ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు రాజమౌళి అండ్ టీమ్ భావిస్తోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 19, 2019, 1:24 PM IST
RRR టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఖరారు..
rrr సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 19, 2019, 1:24 PM IST
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  ఇద్దరు బడా మాస్ హీరోలతో.. అదీ చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దురు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 30,2020లో విడుదల చేయనున్నారు.మధ్యలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గాయాలు కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు కాస్తంత బ్రేక్ వచ్చింది.  RRR సినిమా అయ్యేంతకు వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ వేరే సినిమాలేవి చేయోద్దని రాజమౌళి కోరినట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి లండన్‌లో ప్రదర్శితమయ్యే ‘బాహుబలి’ సినిమా కోసం అక్కడకి వెళ్లాడు. అక్కడ రాయల్ ఆల్బర్ట్ స్టేడియంలో ఈ సినిమాను మరికాసేపట్లో ప్రదర్శించనున్నారు. రాజమౌళి వెంట ప్రభాస్, రానా, అనుష్క కూడా ఉన్నారు.  వారం తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆర్ఆర్ఆర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే RRR సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తైయినట్టు సమాచారం.

RRR movie Updates and Rajamouli designing a action sequence between Tiger and Jr NTR for Introduction pk రాజమౌళి దర్శకుడిగా ఉన్నాడంటే ఏదైనా జరుగుతుంది. అనుకుంటే కొండమీది కోతిని కూడా తీసుకొస్తాడు ఆయన. అలాంటి దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తున్నాడు. rajamouli,rrr,rrr movie,rrr movie twitter,rrr movie instagram,jr ntr rrr,ram charan rrr,rrr movie jr ntr intro scene,rrr movie shooting,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,పులితో ఎన్టీఆర్ ఇంట్రో ఫైట్
RRR సినిమా పోస్టర్ (Source: Twitter)


ఐతే.. ‘RRR’ టైటిల్ పై ఇప్పటికే  పలు ఊహాగానాలు వెలుబడటంతో  ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు రాజమౌళి అండ్ టీమ్ భావిస్తోంది. అవన్ని అసత్య ప్రచారాలని దర్శక నిర్మాతలు కొట్టిపారేశారు. ఐతే.. మరో మూడు రోజుల్లో  ఈచిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్టు  సమాచారం. ఎందుకంటే ఈ నెల 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసి.. ఫైనల్‌గా దీపావళికి మాత్రం ఖచ్చితంగా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించి.. జనాల్లోకి ఈ పేరు తీసుకెళ్లెలా జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...