నల్గొండ కబడ్డీ జట్టును కలిసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్...

నల్గొండ కబడ్డీ జట్టుతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter

ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి నల్గొండ కబడ్డీ జట్టుతో ఫోజిచ్చారు.

 • Share this:
  ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి నల్గొండ కబడ్డీ జట్టుతో ఫోజిచ్చారు. తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 3లో నల్గొండ ఈగల్స్ జట్టు ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలతో నిలబడి ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి మైదానంలో జరిగిన ఈ టోర్నీలో నల్లగొండ ఈగల్స్‌ జట్టు మంచిర్యాల టైగర్స్‌పై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా మూడు పాయింట్లు సాధించిన కార్తీక్‌ యాదవ్‌ (మంచిర్యాల టైగర్స్‌) ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా ఎంపికయ్యాడు. అయితే ఈ పోటీలో విజేత‌గా నిలిచిన న‌ల్గొండ ఈగల్స్ జ‌ట్టు అంతా ఆర్ఆర్ఆర్ సెట్‌కి వెళ్ళి రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ని క‌లిసారు. అంతేకాకుండా వారితో కొన్ని ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ టీమ్ కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేసింది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో మొదలుకానుంది. తదుపరి షెడ్యూల్ పూణేలో జరగనుంది. ఆర్ ఆర్ ఆర్‌ను DVV దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 8, 2021న  దాదాపు పది భాషలలో విడుదల కానుంది.

  Rajamouli Ntr and charan, nalgonda eagles kabaddi team, nalgonda eagles kabaddi team meets the rrr, nalgonda eagles kabaddi team meets rajamouli, nalgonda eagles kabaddi team meets ntr, nalgonda eagles kabaddi team meets charan,telangana premier kabbaddi league,నల్గొండ కబడ్డీ జట్టు,ఆర్ ఆర్ ఆర్ టీమ్, తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్,
  నల్గొండ కబడ్డీ జట్టుతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter
  Published by:Suresh Rachamalla
  First published: