Eega @ 9 years: రాజమౌళి ‘ఈగ’ సినిమాకు 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ దగ్గర సంచలనం..

రాజమౌళి ఈగ సినిమాకు 9 ఏళ్ళు (Rajamouli Eega)

Eega @ 9 years: రాజమౌళి (Rajamouli) నుంచి ఏ సినిమా వచ్చినా సంచలనమే. దర్శకుడిగా మారి 20 ఏళ్ళ అవుతున్నా ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నాడు దర్శక ధీరుడు. వరస విజయాలతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఆయన నుంచి వచ్చిన సంచలన సినిమా ఈగ(Eega).

  • Share this:
రాజమౌళి నుంచి ఏ సినిమా వచ్చినా సంచలనమే. దర్శకుడిగా మారి 20 ఏళ్ళ అవుతున్నా ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నాడు దర్శక ధీరుడు. వరస విజయాలతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఆయన నుంచి వచ్చిన సంచలన సినిమా ఈగ. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మర్యాద రామన్న లాంటి చిన్న సినిమాతో వచ్చాడు రాజమౌళి. సునీల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం విజయం సాధించింది. 2010లో మర్యాద రామన్న వస్తే.. మరో రెండేళ్ళ తర్వాత ఈగ సినిమా చేసాడు రాజమౌళి. దీన్ని కూడా 10 కోట్ల లోపు బడ్జెట్‌తో చిన్న సినిమాలా తెరకెక్కించాలనుకున్నాడు దర్శక ధీరుడు. అయితే జక్కన్న అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి. చిన్న సినిమా అనుకున్నా కూడా భారీ బడ్జెట్‌తోనే ఈగ సినిమాను తెరకెక్కించాడు రాజమౌళి. అలా జులై 6, 2012న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. నాని, సమంత జంటగా నటించిన ఈ చిత్రంలో సుదీప్ విలనిజం అదుర్స్ అనిపించింది.
rajamouli,Eega @ 9 years,rajamouli Eega 9 years,nani samantha eega movie,nani samantha eega movie 9 years,nani samantha eega movie rajamouli 9 years,telugu cinema,రాజమౌళి ఈగ,రాజమౌళి ఈగ సినిమాకు 9 ఏళ్ళు
రాజమౌళి ఈగ సినిమాకు 9 ఏళ్ళు (Rajamouli Eega)

నైజాం: 12.87 కోట్లు
సీడెడ్: 5.85 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.19 కోట్లు
ఈస్ట్: 2.26 కోట్లు
వెస్ట్: 1.86 కోట్లు
గుంటూరు: 2.71 కోట్లు
కృష్ణా: 2.20 కోట్లు
నెల్లూరు: 1.28 కోట్లు

ఏపీ + తెలంగాణ: 32.22 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.68 కోట్లు
ఓవర్సీస్: 6.24 కోట్లు

తమిళ్ + హిందీ + మలయాళం: 14.02 కోట్లు
వరల్డ్ వైడ్: 57.16 కోట్లు
rajamouli,Eega @ 9 years,rajamouli Eega 9 years,nani samantha eega movie,nani samantha eega movie 9 years,nani samantha eega movie rajamouli 9 years,telugu cinema,రాజమౌళి ఈగ,రాజమౌళి ఈగ సినిమాకు 9 ఏళ్ళు
రాజమౌళి ఈగ సినిమాకు 9 ఏళ్ళు (Rajamouli Eega)

ఈగ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల బిజినెస్ చేసింది. పదేళ్ళ కింద ఇంత మొత్తం బిజినెస్ అంటే చిన్న విషయం కాదు.. అయినా కూడా అక్కడున్నది రాజామౌళి కాబట్టి బయ్యర్లు కూడా ధైర్యం చేసారు. వాళ్ల నమ్మకాలు నిలబడ్డాయి.. ఈగ అంచనాలు అందుకుంది. పునర్జన్మల కాన్సెప్టుకు లవ్ స్టోరీ, రివేంజ్ డ్రామా జోడించి రాజమౌళి చేసిన ఈ అద్భుతానికి అన్ని భాషల వాళ్లు ఫిదా అయ్యారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కలిపి 57.16 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బయ్యర్లకు 23.55 కోట్ల లాభాలను అందించింది.
Published by:Praveen Kumar Vadla
First published: