Rajamouli - Mythri Movie Makers : రాజమౌళి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌‌లో భారీ చిత్రం.. హీరో ఎవరంటే..

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజమౌళి సినిమా (File/Photo)

Rajamouli - Mythri Movie Makers : రాజమౌళి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌‌లో భారీ చిత్రం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

  • Share this:
    Rajamouli - Mythri Movie Makers : రాజమౌళి (Rajamouli), మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers )కాంబినేషన్‌‌లో భారీ చిత్రం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే రాజమౌళి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి .. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. బాలీవుడ్‌ సినిమాలకు ఎక్కువగా బిజినెస్ జరిగే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లో పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ కానందున ఈ సినిమా విడుదలను వాయిదా వేసారు. పైగా బాలీవుడ్‌లో రీసెంట్‌గా విడుదలైన అక్షయ్ కుమార్.. ‘బెల్ బాటమ్’తో పాటు కంగనా రనౌత్.. ‘తలైవి’ సినిమాలకు అనుకున్నంత రేంజ్‌లో వసూళ్లు రాలేదు.

    ఈ సినిమాలకు మొదటి రోజు దారుణమైన వసూళ్లు నమోదు చేయడం వంటి కారణాలతో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను విడుదల చేసే సాహసం చేయలేక మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తేదిని నాల్గోసారి వాయిదా వేసారు.ఆర్ఆర్ఆర్  సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో చేయనున్నారు.  ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో జక్కన్నతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను వండివార్చే పనిలో ఉన్నారు.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్‌ (Hollywood) మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే కదా.ఈ జానర్ మహేష్ బాబు (Mahesh Babu)కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. . సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక రాజమౌళి కూడా బాహుబలి నుంచి తన సినిమాలను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

    NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

    ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  తెలుగులో స్టార్ హీరో నటిస్తున్నురా లేకపోతే.. వేరే భాషలకు చెందిన హీరో ఇందులో నటిస్తున్నాడా అనేది చూడాలి.ఈ సినిమా తర్వాత రాజమౌళి.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ సినిమా చేయనున్నారట. ఇప్పటికే ఈ సినిమ ా కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తంలో రాజమౌళికి పారితోషకం కూడా ఇచ్చినట్టు సమాచారం.

    Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

    ఈ సినిమాను రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తరహాలో ముగ్గురు హీరోలతో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అందులో ఓ హీరో ప్రభాస్ నటించే అవకాశం ఉందట. మిగతా ఇద్దరు కూడా తెలుగు స్టార్ హీరోలే నటిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయనున్నారు. రాజమౌళి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రాన్ని వచ్చే నెల రాజమౌళి బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉందట. మరి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజమౌళి ఏ జానర్‌లో సినిమా తెరకెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: