Rajamouli-Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఆ జానర్‌లో ఉంటుందట.. విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మహేష్ బాబు, రాజమౌళి, (Rajamouli, Mahesh Babu)

Rajamouli-Mahesh Babu: మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది.తాజాగా  రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ఏ జానర్ అనేది రచయత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 

  • Share this:
    Rajamouli-Mahesh Babu: మహేష్ బాబుతో రాజమౌళి (Rajamouli) సినిమా అని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది.తాజాగా  రాజమౌళి, మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ఏ జానర్ అనేది రచయత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) వెల్లడించారు. బాహుబలి కంటే ముందు వీళ్లిద్దరు కాంబో పట్టాలెక్కాలి. కానీ వీళ్లిద్దరు తమకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కానీ రాజమౌళి .. బాహుబలి (Bahubali) తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR)సినిమా చేస్తున్నారు. తెలుగులో ఈ  చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీటైంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగుతో పాటు హిందీలో తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ కూడా మొదలు పెట్టారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెలుగు,హిందీతో పాటు మొత్తంగా 17 భాషల్లో డబ్బింగ్ పనులు కూడా చూడాలి.

    దీంతో ఈ సినిమా విడుదల వచ్చే యేడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. రాజమౌళి ప్యాన్ ఇండియా లెవల్లో వచ్చే యేడాది సంక్రాంతి తర్వాత  జనవరి 26న సోలోగా  విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులతో పాటు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలు సంబంధించిన పనులను చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో జక్కన్నతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను వండివార్చే పనిలో ఉన్నారు.

    మహేష్ బాబు, రాజమౌళి (File/Photo)


    అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్‌ (Hollywood) మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ జానర్ మహేష్ బాబు (Mahesh Babu)కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. . సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక రాజమౌళి కూడా బాహుబలి నుంచి తన సినిమాలను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

    మహేష్ బాబు, రాజమౌళి (File/Photo)


    ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా (Pan India) లెవల్లో తెరకెక్కుతున్నాయి. ఇపుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో కాకుండా ప్యాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు.

    రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
    రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)


    ఇక రాజమౌళి కూడా తాను ఏ సినిమా తెరకెక్కించినా.. ముందుగానే ఆ సినిమా స్టోరీ ఏంటనేది ముందుగానే చెప్పేస్తుంటారు. ఒక విధంగా కథ చెప్పి తన సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం రాజమౌళికి ముందు నుంచే ఓ అలవాటు ఉంది. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కాంబినేషన్‌లో ఏ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: